te_tw/bible/other/highplaces.md

2.9 KiB

ఉన్నత స్థలం, ఉన్నత స్థలాలు

నిర్వచనం:

"ఉన్నత స్థలాలు" అంటే విగ్రహ పూజకై వినియోగించే బలిపీఠాలు, దేవస్థానాలు. వీటిని సాధారణంగాఎత్తైన స్థలంలో అంటే కొండలు, గుట్టలపై నిర్మిస్తారు.

  • చాలామంది ఇశ్రాయేలు రాజులు అబద్ధ దేవుళ్ళకు ఈ ఉన్నత స్థలాల్లో బలిపీఠాలు కట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ప్రజానీకాన్ని కూడా విగ్రహాలకు పూజలు చేయించారు.
  • తరచుగా దేవుడంటే భయభక్తులుగల రాజు ఇశ్రాయేలు, యూదాలపై పాలన చేస్తున్నప్పుడు అతడు ఉన్నత స్థలాలు, బలిపీఠాలను కూలగొట్టి విగ్రహ పూజ మాన్పించారు.
  • అయితే, కొందరు మంచి రాజులు ఉన్నత స్థలాలు తొలగించడంలో నిర్లక్ష్యం చూపారు. ఫలితంగా మొత్తం ఇశ్రాయేలు జాతి విగ్రహపూజతో నిండిపోయింది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు. " విగ్రహ ఆరాధనకోసం ఎత్తైన స్థలాలు” లేక “కొండపై విగ్రహస్థానాలు” లేక “విగ్రహ బలిపీఠం మెట్టలు."
  • ఈ పదం విగ్రహం బలిపీఠం అనే అర్థం ఇచ్చేలా జాగ్రత్త తీసుకోండి. కేవలం బలిపీఠాలు ఉన్న ఉన్నత స్థలం కాదు.

(చూడండి: బలిపీఠం, అబద్ధ దేవుడు, ఆరాధన)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1116, H1181, H1354, H2073, H4791, H7311, H7413