2.4 KiB
2.4 KiB
యోషియా
వాస్తవాలు:
యోషియా భక్తిపరుడైన రాజు. ఇతడు యూదా రాజ్యం ముఫ్ఫై-ఒక సంవత్సరాలు పరిపాలించాడు. అతడు యూదా ప్రజలను పశ్చాత్తాపపడేలా యెహోవాను ఆరాధించేలా చేశాడు.
- తన తండ్రి ఆమోను రాజు వధ తరువాత యోషియా ఎనిమిది సంవత్సరాల వయసులో యూదాకు రాజయ్యాడు.
- తన పరిపాలన పద్దెనిమిదవ సంవత్సరంలో యోషియా ప్రధాన యాజకుడు హిల్కియాను యెహోవా ఆలయం కట్టించమని ఆదేశించాడు. అది జరుగుతుండగా ఒక ధర్మ శాస్త్ర ప్రతి దొరికింది.
- దాన్ని యోషియాకు చదివి వినిపించగా తన ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి ధిక్కరించారో విని అతడు దుఃఖపడ్డాడు. విగ్రహ ఆరాధన స్థలాలు నాశనం చేయాలనీ అబద్ధ దేవుళ్ళ పూజారులను చంపాలని అతడు ఆదేశించాడు.
- ప్రజలు పస్కా పండగ మరలా పాటించాలని కూడా ఆదేశించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: అబద్ధ దేవుడు, యూదా, చట్టం, పస్కా, ఆలయం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2977, G2502