te_tw/bible/kt/passover.md

5.9 KiB

పస్కా

వాస్తవాలు:

“పస్కా” అనునది మతపరమైన ఒక పండుగ, దీనిని యూదులు తమ పూర్వికూలైన ఇస్రాయేలియులను ఐగుప్తు బానిసత్వములోనుండి ఏ రీతిగా రక్షించాడో అని జ్ఞాపకము చేసికొనుటకు ప్రతి సంవత్సరము ఈ పండుగను ఆచరిస్తారు.

  • దేవుడు ఇస్రాయేలియుల ఇళ్లను “దాటి వచ్చాడని” మరియు వారి కుటుంబములో మగ శిశువులను చంపక, ఐగుప్తీయుల మగ శిశువులను చంపిన వాస్తవ సంఘటననుండి ఈ పండుగ పేరు వచ్చింది.
  • ఈ పస్కా పండుగలో పులియని రొట్టెలు, ఎటువంటి మచ్చలేని పరిపూర్ణమైన గొర్రెపిల్లను వధించి, దానిని బాగుగా కాల్చి వండిన ఒక ప్రత్యేకమైన భోజనము ఉంటుంది. ఇస్రాయేలియులు ఐగుప్తు దేశమునుండి విడిపించబడక మునుపు రాత్రి వారు తినిన భోజనమును ఈ పదార్థములన్నియు వారికి జ్ఞాపకము చేయును.
  • దేవుడు ఇస్రాయేలియుల ఇళ్లను ఎలా “దాటి వెళ్ళాడో”, ఎలా వారిని ఐగుప్తులో బానిసత్వమునుండి విడిపించాడో జ్ఞాపకము చేసికొని ఆచరించు క్రమములో ఈ భోజనమును ప్రతి సంవత్సరము భుజించాలని దేవుడు ఇస్రాయేలియులకు చెప్పాడు.

అనువాద సలహాలు:

  • “పస్కా” అను పదమును “దాటి” మరియు “వెళ్ళెను” అను పదముల కలయిక ద్వారా అనువాదము చేయబడియుండెను లేదా ఈ అర్థము వచ్చేడి ఇతర పదముల కూర్పు ద్వారా అనువదించబడియున్నదని చెప్పబడియుండెను.
  • ప్రభువు దూత వారి ఇళ్లను దాటి, వారి మగ శిశువులను రక్షించుట అను సంఘటనను వివరించుటకు ఉపయోగించబడిన పదములకు ఈ పండుగకు పెట్టిన పేరుకే స్పష్టమైన అనుబంధము కలిగియున్నట్లయితే ఎంతో సహాయకరముగా ఉంటుంది.

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణములు:

  • 12:14 ప్రతి సంవత్సరము పస్కాను ఆచరించుకొనుట ద్వారా బానిసత్వమునుండి వారు విడుదల మరియు ఐగుప్తీయుల మిద ఆయన విజయమును జ్ఞాపకము చేసికొనవలెనని దేవుడు ఇస్రాయేలియులకు ఆజ్ఞాపించెను.
  • 38:01 ప్రతి సంవత్సరము యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. అనేక శతాబ్దముల క్రితము దేవుడు వారి పూర్వికులను ఐగుప్తు బానిసత్వమునుండి ఎలా రక్షించాడో అని తెలియజేయుటకే ఈ ఆచారము నేలకోనినది.
  • 48:09 యేసు పస్కాను తన శిష్యులతో ఆచరించాడు.
  • 48:09 దేవుడు రక్తమును చూచినప్పుడు, ఆయన వారి ఇళ్లను దాటి వెళ్ళెను మరియు వారి మొదటి సంతాన మగ శిశువులను చంపలేదు. ఈ సంఘననే పస్కా అని పిలుతురు.
  • 48:10_ యేసు మన పస్కా గొర్రెపిల్లయైయున్నాడు. ఆయన పరిపూర్ణుడు మరియు పాపరహితుడైయున్నాడు, మరియు పస్కా పండుగ ఆచార సమయములోనే ఆయనను చంపిరి.

పదం సమాచారం:

  • Strong's: H6453, G3957