te_tw/bible/kt/holyplace.md

4.1 KiB

పరిశుద్ధ స్థలం

నిర్వచనం:

బైబిల్లో, " పరిశుద్ధ స్థలం” “అతి పరిశుద్ధ స్థలం" అనేవి ప్రత్యక్ష గుడారం, లేక ఆలయభవనంలోని రెండు భాగాలు.

  • "పరిశుద్ధ స్థలం" మొదటి గది, అందులో ధూప బలిపీఠం, ప్రత్యేక "సన్నిధి రొట్టెల" బల్ల ఉంటాయి.
  • "అతి పరిశుద్ధ స్థలం" రెండవ, లోపలి గది, ఇందులో నిబంధన మందసం ఉంది.
  • మందమైన బరువైన తెర బయటి గది నుండి లోపలి గదిని వేరు చేస్తున్నది.
  • ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే వెళ్ళగలుగుతాడు.
  • కొన్ని సార్లు "పరిశుద్ధ స్థలం" అంటే రెండు గదులు, ఆలయం, లేక ప్రత్యక్ష గుడారం బయటి ఆవరణ మెదలైనవి కూడా వస్తాయి. సాధారణంగా దేవునికి ప్రత్యేకించిన ఏ స్థలమైనా ఇలా పిలవ వచ్చు.

అనువాదం సలహాలు:

  • "పరిశుద్ధ స్థలం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "దేవునికి ప్రత్యేకించిన గది” లేక “దేవునితో కలుసుకునే ప్రత్యేక గది” లేక “దేవునికి కేటాయించిన స్థలం."
  • "అతి పరిశుద్ధ స్థలం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవునికి మాత్రమే ప్రత్యేకించిన గది” లేక “దేవునితో సమావేశం అయ్యే అత్యంత ప్రత్యేకమైన గది."
  • సందర్భాన్ని బట్టి, ఈమాట అనువదించే పద్ధతులు "ప్రతిష్టించిన స్థలం” లేక “దేవుడు ప్రత్యేకించుకున్న స్థలం” లేక “ఆలయంలో పరిశుద్ధప్రదేశం” లేక “దేవుని పరిశుద్ధ ఆలయంలో బయటి ఆవరణ."

(చూడండి: ధూప బలిపీఠం, నిబంధన మందసం, రొట్టె, సమర్పించు, బయటి న్యాయ స్థానం, తెర, పరిశుద్ధ, ప్రత్యేకించు, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1964, H4720, H4725, H5116, H6918, H6944, G39, G40, G3485, G5117