te_tw/bible/other/bread.md

4.3 KiB

రొట్టె

నిర్వచనం:

రొట్టె అనేది పిండిలో నీరు, నూనే కలిపి ముద్దా చేసి ఆహారంగా వండిన పదార్థం. ముద్దను తరువాత రొట్టె ఆకారంలో వత్తి పెనంపై కాలుస్తారు.

  • ఈ పదం "రొట్టె" అనేది దానంతట అదే కనిపించినప్పుడు అది అంటే "పెద్ద రొట్టె" అనే అర్థం వస్తుంది.
  • రొట్టె ముద్దకు సాధారణంగా పొంగజేసే పదార్థం కలిపి అది పొంగేలా చేస్తారు.
  • రొట్టె ను పొంగజేసే పదార్థం కలపకుండా కూడా చేస్తారు. బైబిల్లో "పొంగని రొట్టె" అని పిలిచిన దాన్ని యూదుల పస్కా భోజనంలో ఉపయోగిస్తారు.
  • బైబిల్ కాలంలో రొట్టె అనేక మంది ప్రజలు ముఖ్య ఆహారం గనక ఈ పదాన్ని బైబిల్లోసాధారణంగా ఆహారాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)
  • ఈ పదం "సన్నిధి రొట్టెలు" ప్రత్యక్ష గుడారం, లేక ఆలయంలో దేవునికి బలి అర్పణగా బంగారు బల్లపై ఉంచే పన్నెండు రొట్టెలను సూచిస్తుంది. ఈ రొట్టెలు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలకు గుర్తు. వీటిని యాజకులు మాత్రమే తినాలి. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు వారి మధ్య నివసించాడు అని సూచించే రొట్టె."
  • అలంకారికంగా “పరలోకంనుండి వచ్చిన ఆహారం" అనే మాట దేవుడు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలో ఇచ్చిన "మన్నా" అనే పేరున్న ప్రత్యేకమైన తెల్లని ఆహారం.
  • యేసు కూడా తనను "పరలోకం నుండి వచ్చిన ఆహారం" అనీ "జీవాహారం” అనీ పిలిచాడు.
  • యేసు, తన శిష్యులు అయన మరణానికి ముందు పస్కా భోజనం కలిసి తినేటప్పుడు అయన పొంగని పస్కా రొట్టెతో తన శరీరాన్ని పోల్చాడు. ఆ శరీరం సిలువపై హింసల పాలు అవుతుంది.
  • అనేక సమయాల్లో ఈ పదం "రొట్టె"ను సాధారణంగా "ఆహారం" అని తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: పస్కా, ప్రత్యక్ష గుడారం, ఆలయం, పొంగని రొట్టె, పొంగజేసే పదార్థం )

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2557, H3899, H4635, H4682, G106, G740, G4286