te_tw/bible/kt/unleavenedbread.md

3.7 KiB

పులియని రొట్టె

నిర్వచనము:

“పులియని రొట్టె” అనునది “పులియనిపదార్థముకలిగినదానితో” గాని లేదా “ఏ ఇతర పులియని పదార్థముతో” గాని చేయబడనిదానికి సూచనగా ఉన్నది. ఈ విధమైన రొట్టె పొంగదు ఎందుకంటే దీనిలో పొంగచేసే పులియనిపదార్థము ఏది ఉండదు.

  • దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రయేలీయులను బయటికిరప్పించినప్పుడు, వారి రొట్టెలు పొంగేవరకు ఎదురుచూడకుండా త్వరగా ఐగుప్తును విడిచి పారిపొమ్మని వారికీ ఆజ్ఞాపించెను. అందువలన వారు పులియనిరొట్టెలను భుజించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం వారు ఐగుప్తునుండి విడిపింపబడినదానికి గుర్తుగా పస్కా పండుగలో ఈ పులియని రొట్టెలను తినేవారు.
  • పులియుట అనునది పాపమునకు గుర్తుగా ఉంది కావున, “పులియని రొట్టె” ఆనేది ఒక వ్యక్తి తన జీవితంనుండి పాపమును తీసివేసుకొని దేవున్ని ఘనపరచడాన్ని సూచిస్తుంది.

తర్జుమా సలహాలు:

  • ఇంకా కొన్ని అనువాదాలలో ఈ పులియుట అనేపదం “పులియని పదార్థం కలుపబడని రొట్టె ” లేదా “పొంగని రొట్టె” అని చెప్పబడింది.
  • “పులిసేగుణంలేని పదార్థం, పులియని పదార్థం” అనేదానిని ఎలా అనువదించాలి అనేది ఈ పదం యొక్క అనువాదంలో స్థిరముగా నిర్ధారించారు.
  • కొన్ని సందర్భాలలో, “పులియని రొట్టె” ను “పులియని రొట్టెల పండుగ” అని కూడా అనువదించవచ్చు.

(దీనిని చూడండి: రొట్టె, ఐగుప్తు, విందు, పస్కా పండుగ , దాసుడు, పాపము, ఈస్టు)

బైబిల్ వచనములు:

పదం సమాచారం:

  • Strong's: H4682, G106