te_tw/bible/other/curtain.md

2.8 KiB

తెర, తెరలు

నిర్వచనం:

బైబిల్లో, "తెర" అంటే మందం అయిన, బరువైన గుడ్డతో చేసిన పరదా. దీన్ని ప్రత్యక్ష గుడారం, ఆలయం చెయ్యడంలో ఉపయోగిస్తారు.

  • ప్రత్యక్ష గుడారాన్ని పైనుండి నాలుగు పొరలుగా ఉన్న తెరలు ఉపయోగించి నిర్మిస్తారు. ఈ తెర లను గుడ్డతో లేక జంతువు చర్మాలతో చేస్తారు.
  • గుడ్డ తెరలు కూడా ప్రత్యక్ష గుడారం బయటి ఆవరణ చుట్టూ ఉన్న గోడ కోసం ఉపయోగిస్తారు. ఈ తెరలను "సన్న నార బట్ట" తో చేస్తారు. ఇది జనపనారతో చేసిన ఒక రకమైన గుడ్డ.
  • ప్రత్యక్ష గుడారం, ఆలయం భవనం, రెంటి లోనూ మందమైన గుడ్డ తెరను పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య వేలాడ దీస్తారు. యేసు చనిపోయాక అద్భుతమైన రీతిలో రెండు భాగాలుగా చినిగిన తెర ఇదే.

అనువాదం సలహాలు:

  • ఆధునిక తెరలు బైబిల్ కాలం తెరలకు భిన్నమైనవి కాబట్టి ఈ తెరలను స్పష్టంగా చెప్పడానికి వివిధ పదాలు వాడడం మంచిది.
  • సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం, "కప్పే తెర” లేక “యవనిక” లేక “మందం గుడ్డ” లేక “జంతువు చర్మం కప్పు” లేక “వేలాడే గుడ్డ."

(చూడండి: పరిశుద్ధ స్థలం, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1852, H3407, H4539, H6532, H7050, G2665