te_tw/bible/kt/consecrate.md

2.8 KiB

సమర్పించు, ప్రతిష్టించి, ప్రతిష్ఠ

నిర్వచనం:

సమర్పించు అంటే దేన్నైనా లేక ఎవరినైనా దేవుని సేవకు ప్రతిష్టించు అని అర్థం. ప్రతిష్టించిన ఒక వ్యక్తిని లేక వస్తువును దేవునికి పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ఎంచుతారు.

  • ఈ పదం అర్థం "పవిత్రీకరణ” లేక “పరిశుద్ధపరచడం." అయితే మరికొంత అర్థం కలుస్తుంది. పథకం ప్రకారం ఎవరినైనా దేవుని సేవకు ప్రత్యేక పరచడం.
  • వస్తువులు దేవునికి ప్రతిష్టించేవి బలి జంతువులు, ప్రత్యక్ష గుడారంలోని దహన బలిపీఠం మొదలైనవి.
  • దేవునికి ప్రతిష్టించిన వ్యక్తులు యాజకులు, ఇశ్రాయేలు ప్రజలు, తొలిచూలు మగ బిడ్డ.
  • కొన్ని సార్లు ఈ పదం "సమర్పించు" అనే దానికి, "శుద్ధి చేయు," అనే అర్థమే ఉంటుంది. ముఖ్యంగా అది మనుషులను, వస్తువులను దేవుని సేవకు ఇవ్వడంలో వారు దేవునికి శుద్ధం గాను, అంగీకారయోగ్యం గాను ఉండేలా చెయ్యాలి.

అనువాదం సలహాలు:

  • "సమర్పించు" అనే పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. " దేవుని సేవకు కేటాయించు” లేక “దేవుణ్ణి సేవించడానికి శుద్ధి చేయు."
  • ఈ పదాలు "పరిశుద్ధ” “పవిత్రీకరణ" ఎలా అనువదించ వచ్చో గమనించండి.

(చూడండి: పరిశుద్ధ, శుద్ధ, పవిత్రీకరణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2763, H3027, H4390, H4394, H5144, H5145, H6942, H6944, G1457, G5048