te_tw/bible/kt/sanctify.md

4.0 KiB

పవిత్రపరచు, పవిత్రపరచును, పవిత్రీకరణ

నిర్వచనము:

పవిత్రపరచుట అనగా ప్రత్యేకించబడుట లేక పరిశుద్ధపరచుట. పవిత్రీకరణ అనగా పరిశుద్ధపరచు యొక్క ప్రక్రియయైయున్నది.

  • పాత నిబంధనలో కొంతమంది ప్రజలు పవిత్రీకరించబడిరి మరియు వస్తువులు పవిత్రీకరణ చేయబడ్డాయి, లేక దేవుని సేవకొరకు ప్రత్యేకపరచబడ్డాయి.
  • యేసునందు విశ్వసించిన ప్రజలను దేవుడు పవిత్రీకరణ చేయునని క్రొత్త నిబంధన బోధించుచున్నది. అనగా, ఆయన వారిని పరిశుద్ధపరచును మరియు తనకు సేవ చేయుటకొరకు వారిని ప్రత్యేకపరచును.
  • యేసును నమ్మిన విశ్వాసులు కూడా దేవుని కొరకు తమ్మునుటాము పవిత్రీకరించబడాలని, వారు చేయు ప్రతి కార్యమునందు పరిశుద్ధముగా ఉండాలని ఆజ్ఞాపించబడిరి.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “పవిత్రపరచు” అనే పదమును “ప్రత్యేకించు” లేక “పరిశుద్ధపరచు” లేక “పవిత్రపరచు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ప్రజలు తమ్మునుతాము పవిత్రపరచుకొనినప్పుడు, వారు తమ్మునుతాము పరిశుద్ధపరచుకొనుచున్నారు మరియు దేవుని సేవకొరకు తమ్మునుతాము సమర్పించుకొనుచున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించబడిన “పవిత్రత” అనే పదమును ఈ అర్థముతో ఉపయోగించబడియున్నది.
  • దీని అర్థము “పవిత్రత” అయినప్పుడు, ఈ పదమును “దేవుని సేవ కొరకు ఎవరినైనా (లేక దేనినైనా) సమర్పించు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “మీ పవిత్రీకరణ” అనే ఈ మాటను “మిమ్మును పరిశుద్ధపరచుట” లేక “(దేవుని కొరకు) మిమ్మును ప్రత్యేకించుకొనుట” లేక “మిమ్మును పరిశుద్ధపరచునది” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: పవిత్రత, పరిశుద్ధత, ప్రత్యేకించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6942, G37, G38