te_tw/bible/other/yoke.md

3.3 KiB

కాడి, కాడిమోపిన, బంధించబడిన

నిర్వచనం:

కాడి అనేది చెక్కతో లేక లోహముతో చేయబడిన పరికరమైయున్నది. దీనిని రెండు లేక అనేక పశువులకు కట్టి బండిని లాగుటకైనను లేక నాగలిని లాగుటకైనను ఉపయోగించుదురు. ఈ పదమునకు పలు అలంకారిక అర్థములు కలవు.

  • “కాడి” అనే పదమును ఒక ఉద్దేశ్యం కొరకై కలసి పనిచేయు అనేకులను ఏకముచేసే ఏదైనా విషయము గూర్చి సూచించడానికి అలంకారికంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు యేసును సేవించడం.
  • పౌలు వలే క్రీస్తును సేవిస్తున్నవారిని సూచించుటకు ఆయన “నాతో కాడి మోయువాడు” అని సంబోధించారు. దీనిని “తోటి పనివాడు” లేక “తోటిదాసుడు” లేక “జత పనివాడు” అని అనువాదం  చేయవచ్చును.
  • “కాడి” అనే పదమును బానిసత్వములో ఉన్నప్పుడు లేక హింసిచబడుచున్నప్పుడు ఒకడు మోసే భారమును అలంకారికంగా అనేక మార్లు ఉపయోగించబడియున్నది.
  • వ్యవసాయం చేయుచున్నప్పుడు కాడి అని స్థానికంగా ఉపయోగించే విధముగానే అనేక సందర్భాలలో, ఈ పదమునకు అక్షరార్థముగా అనువాదం చేయుట మంచిది.
  • ఈ పదమును అలంకారికంగా ఉపయోగించబడినప్పుడు దానిని అనువాదం చేయడానికి “అణచివేయునంత భారము” లేక “అధిక భారువు” లేక “బంధకము” అని సందర్భానుసారంగా అనువాదం చేయగలరు.

(ఈ పదములను కూడా చూడండి: bind, burden, oppress, persecute, servant)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3627, H4132, H4133, H5674, H5923, H6776, G20860, G22180