te_tw/bible/other/servant.md

14 KiB
Raw Permalink Blame History

సేవకుడు, సేవించడం, బానిస,  యవనస్థుడు, యవన స్త్రీ

నిర్వచనం:

ఒక “సేవకుడు” లేదా “బానిస” మరొక వ్యక్తి కోసం పని (లోబడే) చేసే వ్యక్తిని సూచిస్తుంది, ఇది అతని ఎంపిక ద్వారా గానీ లేదా బలవంతంగా దాని ఉంటుంది. ఒక సేవకుడు తన యజమాని నియంత్రణలో ఉంటాడు. బైబిలులో "సేవకుడు," "బానిస" పదాలు ఎక్కువగా ఒకదానితో ఒకటి మార్పు చెయ్యగలిగిన పదాలు. “సేవే చెయ్యడం” పదం సాధారణంగా ఒకరి కోసం పని చెయ్యడం అని అర్థాన్ని ఇస్తుంది, ఈ భావం వివిధ రకాల సందర్భాలలో అన్వయించబడవచ్చు.

  • ఒక బానిస తాను పనిచేస్తున్న వ్యక్తికి ఒక రకమైన ఆస్తిగా ఉంటాడు. . బానిసను కొన్న వ్యక్తిని అతని “హక్కుదారుడు” లేదా “యజమాని” అని పిలువబడతాడు. కొందరు యజమానులు తమ బానిసలను క్రూరంగా చూస్తారు. ఇతర యజమానులు వారి బానిసలను ఇంటిలో విలువైన సభ్యులుగానే చక్కగా చూస్తారు. “బానిసత్వం” అనే పదానికి బానిసగా ఉండే స్థితి అని అర్థం.
  • ఒక వ్యక్తి బానిసగా తాత్కాలికంగా ఉండవచ్చు. ఉదాహరణకు రుణాన్ని తన యజమానికి తిరిగి చెల్లించడానికి పని చేస్తుంటాడు.
  • “యవ్వన పురుషుడు” లేదా “యవ్వన స్త్రీ” అనే పదాలకు తరచుగా “సేవకుడు” లేదా “బానిస” అని అర్థాన్ని ఇస్తాయి. ఈ అర్ధం సందర్భం నుండి గ్రహించబడుతుంది. ఈ పరిస్థితికి ఒక సూచిక ఏమిటంటే స్వాధీనంలో ఉన్న భావన ఉపయోగించబడినట్లయితే, ఉదా. “ఆమె యవ్వన స్త్రీలు” పదం “ఆమె సేవకులు” లేదా “ఆమె బానిసలు” అని అనువదించబడవచ్చు.
  • “బానిసను చెయ్యడం” అనే పదానికి “ఒక బానిసగా ఉండేలా చెయ్యడం” (సాధారణంగా బలవంతంగా జరుగుతుంది).
  • మానవులు పాపానికి బానిసలుగా క్రొత్త నిబంధన మాట్లాడుతుంది, యేసు వారిని దాని నియంత్రణ మరియు శక్తినుండి విముక్తి చేసేంతవరకూ వారు బానిసలే. ఒక వ్యక్తి క్రీస్తులో నూతన జీవితాన్ని పొందినప్పుడు,  అతడు పాపానికి బానిసగా ఉండటం నిలిపివేస్తాడు మరియు నీతికి బానిస అవుతాడు.

అనువాదం సూచనలు

  • “సేవ చేయడం” పదం సందర్భాన్ని బట్టి "ఒకరికి సేవకుడు” లేదా “ఒకరి కోసం పని” లేదా “శ్రద్ధ తీసుకోవడం" లేదా "విధేయత చూపించడం" అని అనువదించబడవచ్చు.
  • "యవనస్తుడు" లేదా "యవన స్త్రీ" పదాలు తరచుగా "సేవకుడు" లేదా "బానిస" అనే అర్థాన్ని ఇస్తాయి. ఈ అర్థం సందర్భాన్ని బట్టి వివేచించబడతాయి. స్వాధీనతా సంబంధపదం ఉపయోగించబడినట్లయితే అది ఈ పరిస్థితికి సూచికగా ఉంటుంది. ఉదాహరణకు, "ఆమె యవ్వన స్త్రీలు" పదం "ఆమె పరిచారకులు" లేదా ""ఆమె బానిసలు" అని అనువదించబడవచ్చు. ,
  • తరచుగా ఒకరు తనను తాను "నేను నీ దాసుణ్ణి" అని సూచించుకొంటున్నప్పుడు అతడు మాట్లాడుతున్న వ్యక్తికి గౌరవాన్ని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తికి సామాజికంగా ఉన్నత స్థితి ఉండవచ్చు లేదా మాట్లాడేవారు వినయాన్ని చూపిస్తుండవచ్చు. ఈ మాట చెపుతున్న వ్యక్తి వాస్తవానికి దాసుడు అని అర్థం కాదు.
  • "దేవుణ్ణి సేవించడం" పదం "దేవుణ్ణి ఆరాధించండి, లోబడండి" లేదా "దేవుడు ఆజ్ఞాపించిన పనిని చెయ్యండి" అని అనువదించబడవచ్చు.
  • పాత నిబంధనలో దేవుని ప్రవక్తలూ, దేవుణ్ణి ఆరాధించే ఇతరులూ తరచుగా "సేవకులు" అని సూచించబడ్డారు.
  • “దేవునిని సేవించడం” పదం "దేవుని ఆరాధించండి, ఆయనకు విధేయత చూపండి" లేదా "దేవుడు ఆజ్ఞాపించిన వారిని చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవునికి విధేయులైన ప్రజలు తరచుగా “దాసులు” అని పిలువబడ్డారు.
  • “బల్ల వద్ద సేవచేయ్యండి" అంటే బల్ల దగ్గర కూర్చునియున్నప్రజలకు ఆహారాన్ని తీసుకురండి" లేదా సర్వ సాధారణముగా “ఆహారమును పంచండి” అని అర్థం.
  • ఒక వ్యక్తి తన అతిథులకి పరిచర్య చేసే సందర్భంలో ఈ పదం "శ్రద్ధ తీసుకోవడం" లేదా "ఆహారాన్ని వడ్డించడం" లేదా "ఆహారాన్ని సమకూర్చడం" అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రజలకు ఆహారాన్ని వడ్డించండని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు ఈ పదం "పంచండి" లేదా "అందించండి" లేదా "ఇవ్వండి" అని అనువదించబడవచ్చు.
  • దేవునిని గూర్చి ఇతరులకు బోధించే ప్రజలు దేవునికినీ, వారి వాక్యబోధను వినుచున్న ప్రజలకూ సేవచేస్తున్నారు.
  • తాము పాత నిబంధనకు ఏవిధంగా “సేవ చేసేవారో” అనే దానిని గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీ క్రైస్తవులకు రాశాడు. ఇది మోషే ధర్మశాస్త్రమునకు విధేయులై జీవించినట్లు సూచించుచున్నది. ఇప్పుడు వారు క్రొత్త నిబంధనకు “సేవ చేయుచున్నారు.” అనగా, యేసు సిలువలో బలియైనందున, యేసును విశ్వసించినవారు దేవునిని సంతోషపరచుటకునూ, పరిశుద్ధమైన జీవితాలను జీవించుటకు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడియున్నారు.
  • పాత నిబంధనకు గానీ లేదా క్రొత్త నిబంధనకు గానీ వారు చేసిన క్రియలను వారి "సేవ" రూపంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈ పదం “సేవచేయడం" లేదా “విధేయత చూపడం” లేదా "భక్తికలిగి యుండడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: bondage, works, obey, house, lord)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __6:1__అబ్రహాము బాగా వృద్దుడైనప్పుడు ఇస్సాకు పెద్దవాడై ఎదిగియున్నాడు, అబ్రాహాము తన దాసులలో ఒకరిని పిలిచి, తన బంధువులు నివాసముండిన స్థలమునకు పంపించి, అక్కడ తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను చూడమని పంపించాడు.
  • 8:4 బానిస వ్యాపారులు ధనికుడైన ప్రభుత్వ అధికారికి యోసేపును __ బానిసగా __ అమ్మివేసారు.
  • 9:13 “నేను (దేవుడు) నిన్ను (మోషేను) ఫరో వద్దకు పంపించెదను, తద్వారా నువ్వు ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొని వచ్చెదవు.”
  • 19:10“అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, యెహోవా, నీవు ఇశ్రాయేలు దేవుడవని మరియు నేను నీ దాసుడనని ఈ రోజున మాకు కనుపరచుము” అని ఏలియా ప్రార్థించాడు.
  • 29:3 “దాసుడు అప్పు తీర్చనందున, ‘తాను చేసిన ఆప్పు తీర్చుటకు ఈ మనుష్యుని మరియు తన కుటుంబమును బానిసలుగా అమ్మివేయండి” అని రాజు చెప్పాడు.
  • 35:6 “నా తండ్రి ఇంటనున్న దాసులందరూ తినడానికి ఎంతో ఉంది, మరియు అయితే నేను ఇక్కడ అలమటిస్తున్నాను.”
  • __47:4__వారు నడుస్తూ వస్తుండగా, దాసి “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు” అని గట్టిగా కేకలు వేసి చెప్పింది.
  • 50:4 “దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు” అని యేసు కూడా చెప్పాడు.

పదం సమాచారం:

  • Strongs: H3533, G26150