te_tw/bible/kt/works.md

4.5 KiB
Raw Permalink Blame History

పని, పనులు (కార్యములు), క్రియలు,

నిర్వచనం:

"పని" పదం సహజంగా ఏదైనా ఒకదానిని పూర్తి చెయ్యడానికి ప్రయత్నం చేసే చర్యను సూచిస్తుంది, లేదా ఆ చర్యయొక్క ఫలితాన్ని సూచిస్తుంది. "పనులు" పదం పనులన్నిటినీ ఒక మొత్తంగా సూచిస్తుంది (అంటే చెయ్యబడిన పనులు లేదా చెయ్యవలసిన పనులు)

  • బైబిలులో ఈ పదాలు సాధారణంగా దేవునికీ, మానవులకూ సంబంధించినవిగా ఉపయోగించబడ్డాయి. “దేవునికి సంబంధించి ఉపయోగించినప్పపుడు, బైబిలులో "పని” పదం తరచుగా ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని చర్యనూ లేదా తన ప్రజలను కాపాడిన కార్యాన్ని (వారి శత్రువులనుండి గానీ, పాపం నుండి గానీ, లేదా రెంటినుండి గానీ) సూచిస్తుంది.
  • దేవుని “కార్యములు” ఆయన చేస్తున్న పనులన్నిటినీ లేదా చేసిన పనులన్నిటినీ, అంటే లోక సృష్టి, పాపులను రక్షించడం, సమస్త సృష్టి అవసరాలు తీర్చడం, సమస్త సృష్టిని కాపాడడం, సూచిస్తున్నాయి.
  • ఒక వ్యక్తి చేసే పనులూ లేదా కార్యాలూ మంచివైయుండవచ్చు లేక చెడ్డవైయుండవచ్చు.

అనువాదం సూచనలు:

  • “పనులు” పదం “క్రియలు” లేదా "చర్యలు" లేదా "జరిగిన కార్యాలు" అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.
  • దేవుని "పనులు" లేదా “కార్యములు” లేదా "ఆయన చేతి కృత్యములు” పదాలు "అద్భుతాలు" లేదా "శక్తిగల కార్యాలు" లేదా "దేవుడు చేస్తున్న కార్యాలు" అని అనువదించబడవచ్చు.
  • “దేవుని కార్యం" వ్యక్తీకరణ "దేవుడు చేస్తున్న కార్యాలు" లేదా "దేవుడు చేస్తున్న అద్భుతాలు" లేదా "దేవుడు పూర్తి చేసిన సమస్తము" అని అనువదించబడవచ్చు.
  • “పని” అనే పదం "ప్రతీ మంచి పని" లేదా "ప్రతీ మంచి కార్యం" లో ఉన్నట్టుగా “పనులు” పదానికి ఇది ఏకవచనం.
  • “పని” దేవుని కోసం లేదా ఇతరుల కోసం చేసినప్పుడు "సేవ" లేదా "పరిచర్య" అని అనువదించబడవచ్చు.

(చూడండి:fruit, Holy Spirit, miracle)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H4399, H4566, H4567, H4611, H4659, H5949, G20410