te_tw/bible/other/burden.md

2.7 KiB

భారం, బరువు, భారంతో ఉన్న, భారమైన పని, కష్టమైన శ్రమ, ఉచ్చారణ

నిర్వచనం:

భారం అంటే బరువైనది మోత. ఇది అక్షరాలా భౌతికమైన దాన్ని సూచిస్తున్నది, అంటే బరువులు మోసే జంతువు వలె. "భారం"అనే దానికి అనేక అలంకారిక అర్థాలు ఉన్నాయి:

  • భారం అంటే ఒక వ్యక్తిపై ఉన్న దుర్లభం అయిన/కష్టమైన పని, లేక ఒక వ్యక్తి చేయవలసిన ముఖ్యమైన బాధ్యత. అతను "భారం భరించు” లేక “మోయు" "మోయలేని భారం"అని చెప్పవచ్చు.
  • క్రూరమైన నాయకుడు భరించలేని భారాలు తాను పాలించే ప్రజలపై మోప వచ్చు/అవకాశమున్నది. ఉదాహరణకు పెద్ద మొత్తంలో పన్నులు కట్టమని బలవంతం చేయుట.
  • ఒక వ్యక్తి ఎవరికైనా భారంగా ఉండడం ఇష్టం లేకపోతే అతడు ఎదుటి వాడికి ఎలాటి సమస్యా కలిగించడు.
  • ఒక మనిషి అపరాధ భావం, పాపం అతనికి భారం.
  • "ప్రభువు భారము"అంటే అలంకారికంగా ఒక ప్రవక్త దేవుని ప్రజలకు ప్రకటించే "దేవుని సందేశం."
  • ఈ పదం "భారం"అనే పదాన్ని. "బాధ్యత ” లేక “విద్యుక్త ధర్మం/విధి” లేక “బరువైన భారం” లేక “సందేశం," సందర్భాన్ని బట్టి ఇలా అనువదించవచ్చు..

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2960, H3053, H4614, H4853, H4864, H5445, H5447, H5448, H5449, H5450, H6006, G00040, G09160, G09220, G23470, G25990, G26550, G54130