te_tw/bible/other/wisemen.md

6.0 KiB

జ్ఞానులు

సత్యాంశములు:

పరిశుద్ధ గ్రంథములో “జ్ఞానులు” అనే మాట అనేకమార్లు దేవునిని సేవించే వ్యక్తులను మరియు మూర్ఖముగా కాకుండా జ్ఞానముగా నడుచుకునే వ్యక్తులను సూచిస్తుంది. రాజు ఆవరణములో అసాధారణమైన తెలివితోనూ మరియు సామర్థ్యములతోనూ పనిచేసే మనుష్యులను సూచించే ఒక ప్రత్యేకమైన మాట లేక పదమైయున్నది.

  • కొన్నిమార్లు “జ్ఞానులు” అనే మాటను “జ్ఞానముతో కూడిన మనుష్యులని” లేక “వివేకముగల పురుషులు” అని వాక్యములలో వివరించబడియున్నది. ఈ పదము జ్ఞానముగా నీతిగా నడుచుకొను మనుష్యులను సూచిస్తుంది, ఎందుకంటే వారు దేవునికి విధేయత చూపియున్నారు.
  • ఫరోను మరియు ఇతర రాజులను సేవించిన “జ్ఞానులు” అనేకమార్లు నక్షత్రములను అధ్యనము చేసిన పండితులైయుండిరి, విశేషముగా ఆకాశములో నక్షత్రములు కలిగియున్న ఆకారములు లేక నమూనాలకొరకు ప్రత్యేకమైన అర్థాలను వెదికేవారు.
  • అనేకమార్లు కలల అర్థాలను వివరించుటకు జ్ఞానులు ఎదురుచూచియుండిరి. ఉదాహరణకొరకు, రాజైన నేబుకద్నేజరు తనకు వచ్చిన కళలను వివరించాలని మరియు వాటి అర్థాలను చెప్పాలని జ్ఞానులకు ఆదేశించెను, కాని వారిలో ఎవరును ఆ పనిని చేయలేకపోయిరి, అయితే దానియేలు ఈ జ్ఞానమును దేవునినుండి పొందియుండెను.
  • కొన్నిమార్లు జ్ఞానులు కూడా దుష్టాత్మల ద్వారా జరిగించబడే మాయలు లేక భవిష్యం చెప్పే మాయాజాల క్రియలు చేసేడివారు.
  • క్రొత్త నిబంధనలో యేసును ఆరాధించుటకు తూర్పు ప్రాంతాలనుండి వచ్చిన కొంతమంది మనుష్యులను ఆంగ్లములో “మ్యాగి” అని పిలిచిరి, ఈ పదమునకు “జ్ఞానులు” అని తర్జుమా చేసిరి, బహుశః విరు తూర్పు దేశపు పాలకునికి సేవలు చేసే పండితులైయుండవచ్చును.
  • ఈ మనుష్యులు బహుశః నక్షత్రములను అధ్యయనము చేసే జ్యోతిష్కులైయుండవచ్చును. బబులోనులో దానియేలు ఉన్నప్పుడు అతను చెప్పిన జ్ఞానుల సంతానమే వీరందరూ అయ్యుండవచ్చును అని కొంతమంది అభిప్రాయపడ్డారు.
  • సందర్భానుసారముగా, “జ్ఞానులు” అనే పదమును “జ్ఞాని” అని పదమును ఉపయోగించి తర్జుమా చేయుదురు లేదా “తలాంతులు పొందిన మనుష్యులు” లేక “విద్యావంతులు” లేక ఒక పాలకుని దగ్గర చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగమూను చేయుచున్న వ్యక్తులను సూచిస్తూ చెప్పే మాటలను ఉపయోగించుకొని కూడా తర్జుమా చేయుదురు.
  • “జ్ఞానులు” అనే పదము నామపదమునకు మాత్రమె సంబంధించినదైతే, “జ్ఞాని” అనే పదమును కూడా పరిశుద్ధ గ్రంథములో అనేకచోట్ల దీనిని ఎలా తర్జుమా చేశారో అలాగే అదే విధముగానే లేక అదే రీతిలోనే తర్జుమా చేయవలసివచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: బబులోను, దానియేలు, భవిష్యవాణి, మాయ, నేబుకద్నేజరు, పాలకుడు, జ్ఞాని)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2445, H2450, H3778, H3779, G4680