te_tw/bible/other/magic.md

2.4 KiB

మాయ(ఇంద్రజాలం), ఇంద్రజాల సంబంధ, ఇంద్రజాలికుడు(మాంత్రికులు), ఇంద్రజాలికులు

నిర్వచనం:

“ఇంద్రజాలం” అనే పదం దేవుని నుండి కాకుండా సహజాతీత శక్తిని వినియోగించే అభ్యాసాన్ని సూచిస్తుంది. ఒక “ఇంద్రజాలికుడు” అంటే ఇంద్రజాలాన్ని అభ్యసించేవాడు.

  • ఐగుప్తులో, దేవుడు మోషే ద్వారా అద్భుతకార్యాలు చేసినప్పుడు, ఐగుప్తుకు చెందినా ఫరో మాంత్రికులు కూడా అటువంటి పనులనే చెయ్యగలిగారు, అయితే వారి శక్తి దేవుని నుండి వచ్చినది కాదు.
  • మంత్రవిద్యలో కొన్ని పదాలను పలకడం, సహజాతీతమైనది జరిగేలా కొన్ని నిర్దిష్టమైన పదాలను తిరిగి తిరిగి వల్లెవేయడం ఉంటుంది.
  • మంత్రవిద్య లేక సోదెచెప్పడం లాంటి అభ్యాసాలు చెయ్యకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
  • మాంత్రికుడు ఇతరులకు హాని చేసే మంత్రవిద్యను అభ్యాసం చేసేవాడు.

(చూడండి: సోదెచెప్పడం, ఐగుప్తు, ఫరో, శక్తి, మంత్రవిద్య)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2748, H2749, H3049, G3097