te_tw/bible/names/babylon.md

4.4 KiB

బబులోను, బబులోనియా, బబులోనియులు

వాస్తవాలు

బబులోను నగరం, బబులోనియా పురాతన ప్రాంతానికి రాజధాని, ఇది కూడా బబులోనియుల సామ్రాజ్యంలోని భాగమే.

  • బబులోను యూఫ్రేట్స్ నది వెంట ఉండేది, అదే ప్రాంతంలో బబెలు గోపురం వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.
  • కొన్నిసార్లు “బబులోను” అనే పదం మొత్తం బబులోనియుల సామ్రాజ్యంలోని సూచిస్తుంది. ఉదాహరణకు, “బబులోను రాజు” నగరాన్ని మాత్రమే కాకుండా మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.
  • యూదా రాజ్యంపై దాడి చేసిన బబులోనియులు శక్తివంతమైన వ్యక్తుల సమూహం మరియు ప్రజలను 70 సంవత్సరాలు బబులోనుల ప్రవాసంలో ఉంచారు.
  • ఈ ప్రాంతం భాగాన్ని “కల్దీయ” అని పిలిచేవారు మరియు అక్కడ నివసించే ప్రజలు “కల్దీయులు”. ఫలితంగా, బబులోను సూచించడానికి " కల్దీయ" అనే పదం తరచుగా ఉపయోగించబడింది. (చూడండి: [ఉపలక్షణము])

(ఇవి కూడా చూడండి: [బబెలు], [కల్దీయ], [యూదా], [నెబుకద్నెజరు])

బైబిలు వాక్యా సూచనలు

  • [1 దినవృత్తాంతములు 9:1]
  • [2 రాజులు 17:24-26]
  • [అపోస్తలుల కార్యములు 7:43]
  • [దానియేలు 1:2]
  • [యెహెజ్కేలు 12:13]
  • [మత్తయి 1:11]
  • [మత్తయి 1:17]

బైబిలు కధలు నుండి ఉదాహరణలు:

  • [20:6] అష్షూరీయులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత, యూదా రాజ్యంపై దాడి చేయడానికి దేవుడు బబులో రాజు నెబుకద్నెజరును పంపాడు. బబులోను ఒక శక్తివంతమైన సామ్రాజ్యం.
  • [20:7] కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, యూదా రాజు __ బబులోను__పై తిరుగుబాటు చేశాడు. కాబట్టి, __ బబులోనియులు__ తిరిగి వచ్చి యూదా రాజ్యంపై దాడి చేశారు. వారు యెరూషలేము పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆలయాన్ని ధ్వంసం చేసి, పట్టణంలో మరియు ఆలయంలోని సంపదలన్నింటినీ తీసుకువెళ్లారు.
  • [20:9] నెబుకద్నెజరు మరియు అతని సైన్యం యూదా రాజ్యంలోని ప్రజలందరినీ __ బబులోను__కి తీసుకువెళ్లారు, పొలాలను నాటడానికి వెనుక పేద ప్రజలను మాత్రమే వదిలివేసారు.
  • [20:11] పారసీకదేశపు రాజు కోరెషు పాలన

దాదాపు డెబ్బై సంవత్సరాల తరువాత, బబులోని ఓడించాడు.

పద సమాచారం:

  • Strong's: హెచ్3778, హెచ్ 3779, హెచ్8152, హెచ్0894, హెచ్0895, హెచ్0896, జి08970