5.2 KiB
5.2 KiB
నెబుకద్నెజరు
వాస్తవాలు:
నెబుకద్నెజారు బాబులోను సామ్రాజానికి రాజు, శక్తివంతమైన అతని రాజ్యం అనేక ప్రజా గుంపులను, దేశాలను ఓడించించింది.
- నెబుకద్నెజరు నాయకత్వంలో బాబులోను సైన్యం యూదా రాజ్యంపై దాడి చేసి దానిని జయించింది, యూదా రాజ్యంలోని అనేకమందిని బబులోనుకు బందీలుగా తీసుకొనివెళ్ళారు. అక్కడ బందీలు 70 సంవత్సరాల కాలం నివసించేలా బలవంతం చేసారు, దానిని “బబులోను చెర” అని పిలిచారు.
- ప్రవాసితులలో ఒకడైన దానియేలు నెబుకద్నెజరు కలలలోని కొన్నింటికి భావాలు చెప్పాడు.
- యూదులలో బందీలలో మరో ముగ్గురు, హనన్యా, మిషాయేలు, అజర్యాలను నెబుకద్నెజరు నిలువబెట్టిన అతి పెద్ద ప్రతిమను పూజించని కారణంగా రాజు వారిని మిక్కిలి వేడిమిగల అగ్నిగుండంలో పడవేసాడు.
- రాజైన నెబుకద్నెజరు చాలా దురహంకారి, అబద్దపు దేవుళ్ళను పూజించాడు. అతడు యూదా రాజ్యాన్ని జయించినప్పుడు, యెరూషలెం దేవాలయంలో అనేకమైన బంగారు, వెండి వస్తువులను దొంగిలించాడు.
- నెబుకద్నెజరు గర్వంతో ఉండి, అబద్దపుదేవుళ్ళను పూజించడం మానని కారణంగా దేవుడు అతనిని జంతువులా ఏడు సంవత్సరాలు అభాగ్యుడిగా జీవించేలా చేసాడు. ఏడు సంవత్సరాల తరువాత దేవుడు నెబుకద్నెజరుని పూర్వస్థితికి తీసుకొని వచ్చాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: అహంకారి, అజర్యా, బబులోను, హనన్యా, మిషాయేలు)
బైబిలు రెఫరెన్సులు:
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 20:06 100 సంవత్సరాల తరువాత సిరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసారు, యూదా రాజ్యంమీద దాడిచేయడానికి బబులోనీయుల రాజు నెబుకద్నెజరు ను దేవుడు పంపాడు.
- 20:06 యూదా రాజు నెబుకద్నెజరు సేవకునిగా ఉండడానికి అంగీకరించాడు, ప్రతీ సంవత్సరం పన్ను కట్టడానికి ఒప్పుకున్నాడు.
- 20:08 యూదా రాజు తిరుగుబాటును శిక్షించడానికీ నెబుకద్నెజరు సైనికులు రాజు కుమారులను అతని ముందే హత్య చేసారు, తరువాత అతనిని కళ్ళు పెరికివేసారు.
- 20:09 నెబుకద్నెజరు అతని సైన్యం యూదా రాజ్యంలోని ప్రజలందరినీ బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళారు, పొలాలలో పంట పండించడానికి పేదవారిని విడిచిపెట్టారు.
పదం సమాచారం:
- Strong's: H5019, H5020