te_tw/bible/other/tradition.md

3.7 KiB
Raw Permalink Blame History

సంప్రదాయం

నిర్వచనం:

"సంప్రదాయం" అనే పదం కాలక్రమేణా ఉంచబడిన ఆచారం లేదా ఆచరణను సూచిస్తుంది మరియు ఇది తరువాతి తరాలలో మనుష్యులకు అందించబడుతూ కొనసాగుతుంది.

  • తరచుగా బైబిలులో "సంప్రదాయాలు" అంటే మనుషుల చేసే బోధలు, ఆచారాలను సూచిస్తుంది, దేవుని ధర్మశాస్త్రం కాదు. "మానవ సంప్రదాయం” లేదా “మానవుల సంప్రదాయం" అనేది దీనిని స్పష్టం చేస్తుంది.
  • "పెద్దల సంప్రదాయాలు” లేదా “పితరుల సంప్రదాయాలు" వంటి వాక్యాలు నిర్దిష్టంగా కాల క్రమేణా యూదు నాయకులు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రానికి జత చేసిన యూదుల వాడుకలు, ఆచారాలను సూచిస్తున్నాయి. అదనంగా ఇవ్వబడిన ఈ సంప్రదాయాలు దేవుని నుండి వచ్చినవి కాకపోయినా మనుష్యులు తాము నీతి మంతులుగా ఉండడానికి వారు వీటిని కూడా పాటించాలని వారు తలంచారు.
  • అపొస్తలుడు పౌలు "సంప్రదాయం" అనే పదాన్ని వివిధరకాలుగా ఉపయోగించాడు. దేవుని నుండి వచ్చిన క్రైస్తవుల అభ్యాసాన్ని గురించి మరియు ఇతర అపొస్తలులు నూతన విశ్వాసులకు బోధించిన దానిని సూచించాడు.
  • ఆధునిక కాలంలో బైబిలులో చెప్పకుండా ఉన్నవి అనేక క్రైస్తవ సంప్రదాయాలు వస్తున్నాయి. అయితే అవన్నీ చారిత్రాత్మకంగా ఆమోదించబడిన వాడుకలు, ఆచారాలు. ఈ సంప్రదాయాలను ఎప్పుడూ బైబిలులో దేవుడు బోధిస్తున్న దాని వెలుగులో చూడాలి.

(వీటిని కూడా చూడండి: అపొస్తలుడు, విశ్వసించు, క్రైస్తవుడు, పూర్వీకుడుr, తరం, యూదుడు, చట్టం, మోషే)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G38620