te_tw/bible/other/tentofmeeting.md

3.4 KiB

ప్రత్యక్ష గుడారం

వాస్తవాలు:

"ప్రత్యక్ష గుడారం" ఒక తాత్కాలిక స్థలం. ప్రత్యక్ష గుడారాన్ని కట్టక మునుపు దేవుడు మోషేను ఇక్కడ కలిసి మాట్లాడే వాడు.

  • ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీయుల శిబిరం బయట నిలిపారు.
  • మోషే ప్రత్యక్ష గుడారంలోకి దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మేఘ స్థంభం గుడారం ద్వారంలో నిలిచి దేవుని సన్నిధికి సూచనగా ఉండేది.
  • తరువాత ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారం కట్టారు. ఇక తాత్కాలిక గుడారం అవసరం లేకపోయింది. "ప్రత్యక్ష గుడారం " అనే దాన్ని కొన్ని సార్లు ఉపయోగిస్తారు సన్నిధి గుడారాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.

(చూడండి: ఇశ్రాయేలు, మోషే, స్థంభం, ప్రత్యక్ష గుడారం, గుడారం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 13:08 దేవుడు ఇశ్రాయేలీయులు నిర్మించవలసిన గుడారం యొక్క వివరణాత్మకమైన వర్ణన ఇచ్చాడు.

దీన్ని ప్రత్యక్ష గుడారం, అన్నారు. ఇందులో రెండు గదులు ఉన్నాయి. వీటిని ఒక పెద్ద తెర వేరు చేస్తున్నది.

  • 13:09 ఎవరైనా దేవుని ఆజ్ఞ మీరితే ఒక జంతువును ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకి తెచ్చి బలి అర్పణగా దేవునికి ఇవ్వాలి.
  • 14:08 దేవుడు చాలా కోపపడి ప్రత్యక్ష గుడారం దగ్గరకి వచ్చాడు.
  • 18:02 ప్రత్యక్ష గుడారానికి బదులు , ప్రజలు ఇప్పుడు ఆలయంలో దేవుణ్ణి ఆరాధించి బలులు అర్పించ సాగారు.

పదం సమాచారం:

  • Strong's: H168, H4150