te_tw/bible/kt/tabernacle.md

4.0 KiB

ప్రత్యక్ష గుడారం

నిర్వచనం:

ప్రత్యక్ష గుడారం అనేది ఒక ప్రత్యేకమైన గుడారం వంటి నిర్మాణం. అక్కడ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ఎడారిలో ప్రయాణించిన కాలంలో ఎడారిలో దేవుణ్ణి ఆరాధించారు.

  • దేవుడు ఇశ్రాయేలీయులకు వివరంగా సూచనలు ఇచ్చాడు. పెద్ద గుడారం నిర్మించాలి. అందులో రెండు గదులు ఉండి, దానిచుట్టూ బయటి అవరణ ఉండాలి.
  • ఇశ్రాయేలీయులు ఎడారిలో వివిధస్థలాలు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి చోటా యాజకులు ప్రత్యక్ష గుడారాన్ని వారి మరుసటి మజిలీకి మోసుకుపోతారు. తరువాత వారు మరలా వారి కొత్త మజిలీ మధ్య భాగంలో దాన్ని నిలబెడతారు.
  • ప్రత్యక్ష గుడారాన్ని కలప ఫ్రేములతో కట్టి గుడ్డ, మేక వెంట్రుకలు, జంతువుల చర్మాలతో చేసిన తెరలతో కప్పుతారు. బయటి ఆవరణం చుట్టూ తెరలు గోడలుగా ఉపయోగ పడతాయి.
  • ప్రత్యక్ష గుడారం రెండు భాగాలు పరిశుద్ధ స్థలం (అక్కడ సాంబ్రాణి వేసే బలిపీఠం ఉంది), అతి పరిశుద్ధ స్థలం (అక్కడ నిబంధన మందసం ఉంచారు).
  • ప్రత్యక్ష గుడారం ఆవరణలో దహన బలిపీఠం ఉంది. అక్కడ హోమం చేసే జంతుబలి అర్పణలు ఆచార రీతిగా కడిగే నీరు ఉన్న గంగాళం ఉంది.
  • యెరూషలేములో సొలోమోను ఆలయం నిర్మించాక ప్రత్యక్ష గుడారం ఉపయోగించడం ఇశ్రాయేలీయులు మానుకున్నారు.

అనువాదం సలహాలు:

  • "ప్రత్యక్ష గుడారం" అంటే "నివాస స్థలం." అనువదించడంలో ఇతర పద్ధతులు, "శుద్ధగుడారం” లేక “దేవుడు నివసించే గుడారం” లేక “దేవుని గుడారం."
  • ఈ పదం అనువాదం "ఆలయం"ను సూచించే పదాలకు భిన్నంగా ఉండేలా చూసుకోండి.

(చూడండి: బలిపీఠం, ధూప బలిపీఠం, నిబంధన మందసం, ఆలయం, గుడారం of సమావేశం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H168, H4908, H5520, H5521, H5522, H7900, G4633, G4634, G4636, G4638