te_tw/bible/other/tent.md

3.3 KiB

గుడారం, గుడారాలు, గుడారం నిర్మాణకులు

నిర్వచనం:

గుడారం అనేది మందమైన బట్టతో కప్పి స్థంభాలపై నిలబెట్టే నివాసం.

  • గుడారాలు చిన్నవిగా కొద్ది మంది ఉండేందుకు అనుగుణంగా ఉండవచ్చు. లేక పెద్దదిగా మొత్తం కుటుంబం నిద్ర పోవడానికి, వంటలు చేసుకోడానికి, నివశించడానికి ఉపయోగపడేది.
  • అనేక మంది ప్రజలకు గుడారాలు శాశ్వత నివాస స్థలాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ఎక్కువ కాలం అబ్రాహాము కుటుంబం కనాను ప్రదేశంలో మేక వెంట్రుకలతో చేసిన దృఢమైన గుడ్డ కప్పిన పెద్ద గుడారాల్లో నివసించారు.
  • ఇశ్రాయేలీయులు కూడా వారి నలభై సంవత్సరాల సీనాయి ఎడారి ప్రయాణాల్లో గుడారాల్లో నివసించారు.
  • ప్రత్యక్ష గుడారం ఒక రకమైన చాలా పెద్దగుడారం. గుడ్డతెరలతో చేసిన మందమైన గోడలు ఉన్నాయి.
  • అపోస్తలుడు పౌలు సువార్త ప్రకటన కోసం వివిధ పట్టణాలు ప్రయాణించినప్పుడు అతడు గుడారాలు చేసి తనను పోషించుకున్నాడు.
  • "గుడారాలు" అనే పదాన్ని కొన్ని సార్లు సాధారణంగా మనుషులు నివాసముండే స్థలాలను సూచించడానికి అలంకారికంగా ఉపయోగిస్తారు. "గృహాలు” లేక “నివాసాలు” లేక “ఇళ్ళు" లేక "శరీరాలు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)

(చూడండి: అబ్రాహాము, కనాను, తెర, పౌలు, సీనాయి, ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H167, H168, H2583, H3407, H6898