te_tw/bible/other/strength.md

7.0 KiB
Raw Permalink Blame History

బలము, బలపరచు, బలమైన

వాస్తవాలు:

“బలము” అనే పదము భౌతిక, మానసిక, ఆత్మీయ శక్తిని సూచిస్తుంది. ఒకరిని లేక దేనినైనా “బలపరచు” అనే మాటకు ఆ వ్యక్తిని బలపరచు లేక ఆ వస్తువును గట్టిపరచు అని అర్థము.

  • “బలము” అనేది ఎదురించే శక్తితో తట్టుకొని నిలువబడే శక్తిని సూచిస్తుంది.
  • ఒక వ్యక్తి పాపము చేయుటకు శోధించబడినప్పుడు, ఆ శోధనను తప్పించుకొనియున్నాడంటే ఆ వ్యక్తి “ఆశా నిగ్రహ బలము” కలిగియున్నాడని అర్థము.
  • కీర్తనాకారులలో ఒకరు యెహోవాయే నా “బలము” అని పలుకుతాడు, ఎందుకంటే దేవుడు తనను బలవంతుడిగా చేసియుండెను.
  • గోడ లేక భవనములాంటి భౌతికమైన కట్టడ “బలపరచబడినప్పుడు”, ప్రజలు నిర్మాణమును తిరిగి కట్టుచున్నారు, ఆ నిర్మాణము ఎటువంటి దాడికైనా పడకుండా ఇటుకలతోనూ లేక ఎక్కువ రాళ్ళతోనూ తిరిగి బలపరచుచున్నారని అర్థము.

అనువాదం సూచనలు:

  • సాధారణముగా “బలపరచు” అనే పదమును “బలముగా ఉండుటకు కారణమగు” లేక “అతి శక్తివంతముగా తయారుచేయు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఆత్మీయ అర్థములో చెప్పాలంటే “మీ సహోదరులను బలపరచు” అనే మాటను “మీ సహోదరులను ప్రోత్సహించు” లేక “మీ సహోదరులు భద్రముగా ఉండుటకు సహాయము చేయుము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ మాటలకు అర్థాన్ని ఈ క్రింది ఉదాహరణలు చూపిస్తాయి, మరియు తద్వారా అవి ఎక్కువ పదాలతో కూడిన మాటలలో వ్రాసినప్పుడు ఎలా తర్జుమా చేయబడ్డాయనే విషయము తెలుస్తుంది.
  • “దట్టిని కట్టుకొనినట్లుగా నా మీద బలమునుంచుము” అనగా “నా నడుము చుట్టూ సంపూర్ణముగా దట్టి ఆవరించినట్లుగా నేను సంపూర్ణముగా బలవంతుడిని అగుటనట్లు చేయుము” అని అర్థము.
  • “నమ్మకము మరియు నెమ్మది అనునది మీ బలము” అనగా “దేవునియందు నమ్మికయుంచుట మరియు నిమ్మళముగా ఉండుట అనునది మీ ఆత్మీయ బలమైయున్నది” అని అర్థము.
  • “వారి బలము పునరుద్ధరించబడును” అనగా “మరియొకమారు బలముగా తయారగుట” అని అర్థము.
  • “నా జ్ఞానము ద్వారా మరియు బలము ద్వారా” అనగా “నేను జ్ఞానవంతుడైనందున, బలవంతుడైనందున నేను ఇవన్నియు చేయగలిగాను” అని అర్థము.
  • “గోడను బలపరచండి” అనగా “గోడను బలకట్టుట” లేక “గోడను తిరిగి నిర్మించుట” అని అర్థము.
  • “నేను నిన్ను బలపరతును” అనగా “నీవు బలముగా ఉండునట్లు నేను కారణమగుదును” అని అర్థము.
  • “యెహోవాయందు మాత్రమె రక్షణ మరియు బలము కలదు” అనగా “యెహోవా మాత్రమె మనలను రక్షించును మరియు మనలను బలపరచును” అని అర్థము.
  • “మీ బలము యొక్క బండ” అనగా “మిమ్మును బలపరచువాడే నమ్మకస్తుడు” అని అర్థము.
  • “రక్షించు నీ కుడి హస్తపు బలముతో” అనగా “ఆయన బలముతో మిమ్మును గట్టిగా భద్రముగా పట్టుకొనినట్లుగానే సమస్యనుండి ఆయన మిమ్మును బలముగా రక్షించును” అని అర్థము.
  • “కొంచెము బలము” అనగా “ఎక్కువ బలములేని” లేక “బలహీనత” అని అర్థము.
  • “నా పూర్ణ బలముతో” అనగా “నా ఉత్తమ వనరులను ఉపయొగిస్తూ” లేక “బలముగా మరియు సంపూర్ణముగా” అని అర్థము.

(ఈ పదములను కూడా చూడండి: faithful, persevere, right hand, save)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0193, H0202, H0353, H0360, H0386, H0410, H0553, H0556, H1369, H1396, H2220, H2388, H2391, H2392, H2393, H2428, H3027, H3028, H3559, H3581, H3811, H3955, H4581, H5326, H5331, H5582, H5797, H5807, H5810, H5934, H5975, H6106, H6109, H6697, H6965, H7292, H7307, H8003, H8443, H8632, H8633, G04610, G09500, G14110, G14120, G17430, G17650, G18400, G19910, G24790, G24800, G29010, G29040, G36190, G37560, G45990, G47320, G47330, G47410