te_tw/bible/kt/righthand.md

6.2 KiB

దక్షిణ హస్తము (కుడి చెయ్యి)

నిర్వచనము:

“దక్షిణ హస్తము” అనే అలంకారిక మాట పాలకుని కుడి హస్తపు బలమును లేక అతని ఘనత యొక్క స్థలమును లేదా ఇతర ప్రాముఖ్యమైన విషయమును సూచించును.

  • దక్షిణ హస్తము అనునది కూడా శక్తికి, అధికారమునకు లేక బలమునకు గురుతుగాను ఉపయోగించబడినది.
  • యేసు తండ్రియైన దేవుని “కుడి పార్శ్వమున” కూర్చొనియున్నాడని, (సంఘమునకు) విశ్వాసులకు శిరస్సుగాను మరియు సమస్త సృష్టి పాలకుని గాను పరిశుద్ధ గ్రంథము వివరించుచున్నది.
  • ఒక వ్యక్తి కుడి చేయిని ఇంకొకరి తలపై పెట్టి ఆశీర్వాదమునిచ్చుటకు ప్రత్యేకమైన ఘనతగా చూపించుటకు ఉపయోగించడమైనది (పితరుడైన యాకోబు యోసేపు కుమారుడైన ఎఫ్రాయిమును ఆశీర్వదించెను).
  • ఒక వ్యక్తి “కుడి చేతి ద్వారా సేవ చేయుట” అనే మాటకు ఒకరు చేసే సేవ ఆ వ్యక్తికి విశేషముగా సహాయకరమైనది మరియు ప్రాముఖ్యమైనది అర్థము.

అనువాదం సూచనలు:

  • కొన్నిమార్లు “దక్షిణ హస్తము” అనే మాటకు అక్షరార్థము ఏమనగా ఒక వ్యక్తి కుడి చేయిని సూచిస్తుంది, ఉదాహరణకు - రోమా సైనికులు యేసుని హేళన చేయుటకు కర్రను యేసు కుడి చేతికిచ్చిరి.      ఈ చేయిని సూచించుటకు భాషలో ఉపయోగించే పదమును ఉపయోగించి తర్జుమా చేయడము మంచిది.
  • అలంకారిక ఉపయోగాలకు సంబంధించి, ఒకవేళ ఆ మాటలో “కుడిచేయి” అనే పదమును వినియోగించి, తర్జుమా చేయు భాషలో అదే అర్థము లేకపోయినట్లయితే, అదే అర్థముతో ఉన్నటువంటి ఇతర విభిన్నమైన మాట ఆ భాషలో ఉందేమోనని గమనించండి.
  • “కుడి చేతి వద్ద” అనే ఈ మాటను “కుడి ప్రక్కన” లేక “ఘనతగల స్థలము ప్రక్కన” లేక “బలముగల స్థానములో” లేక “సహాయము చేయుటకు సిద్ధముగానున్న” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఆయన దక్షిణ హస్తముతో” అనే ఈ మాటను తర్జుమా చేయు అనేకమైన విధానములో “అధికారముతో” లేక “శక్తిని ఉపయోగించి” లేక “అద్భుతమైన ఆయన బలముతో” అనే మాటలు చేర్చబడతాయి.
  • “ఆయన దక్షిణ హస్తము మరియు ఆయన బలమైన హస్తము” అనే ఈ అలంకారిక మాటను దేవుని శక్తిని మరియు గొప్ప బలమును నొక్కి చెప్పుటకు రెండు విధాలుగా ఉపయోగించబడును. ఈ మాటను తర్జుమా చేయు ఒక విధానములో “ఆయన అద్భుతమైన బలము మరియు గొప్ప శక్తి” అని కూడా వ్రాయుదురు. (చూడండి: సమాంతరములు)
  • “వారి కుడి హస్తము అబద్ధము” అనే ఈ మాటను “వారిని గూర్చి గొప్ప ఆలోచన కలిగియున్నప్పటికి, వారు అబద్ధములు చెప్పుట ద్వారా చెడిపోయిరి” లేక “వారికున్న గౌరవము మోసము చేస్తున్నందున చెడిపోయెను” లేక “తమ్మునుతాము బలవంతులనుగా చేసికొనుటకు వారు అబద్ధములాడుదురు” అని కూడా తర్జుమా చేయుదురు.

(చూడండి:accuse, evil, honor, mighty, punish, rebel)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3225, H3231, H3233, G11880