te_tw/bible/other/storehouse.md

3.0 KiB

గిడ్డంగులు, గిడ్డంగుల్లు

నిర్వచనము:

“గిడ్డంగులు” అనగా ఎక్కువ కాలము వస్తువులను లేక ఆహార పదార్థములను ఉంచుటకు ఉపయోగించే ఒక పెద్ద భవనమునైయున్నది.

  • పరిశుద్ధ గ్రంథములో “గిడ్డంగులు” అనేదానిని అప్పటి ప్రజలు నివసించుచున్న ప్రాంతములో కరువు సంభవిస్తే, ఆ సమయములో ఉపయోగించుకొనుటకొరకు ఎక్కువ దిగుబడి వచ్చిన ధాన్యమును మరియు ఇతర ఆహారమును దాచియుంచుటకు సాధారణముగా ఉపయోగించేవారు.
  • దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్న ప్రతి మంచిదానిని సూచించుటకు కూడా ఈ పదమును ఉపయోగించుదురు.
  • దేవాలయములోని గిడ్డంగులలో ఉంచిన విలువైన వస్తువులు (అనగా బంగారు, వెండిలాంటి విలువైన సొత్తులు) యెహోవాకు ప్రతిష్టించబడినవి. వీటిల్లో కొన్నిటిని దేవాలయమును సరిచేయుటకు మరియు నిర్వహించుటకు కూడా అక్కడ ఉంచేవారు.
  • “గిడ్డంగులు” అనే పదమును తర్జుమా చేయు విధానములో “ధాన్యమును నిల్వ ఉంచే భవనము” లేక “ఆహారమును దాచియుంచు స్థలము” లేక “విలువైనవాటిని భద్రముగా ఉంచే స్థలము” అనే మాటలను కూడా ఉపయోగించుదురు.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధ, ప్రతిష్టించు, కరువు, బంగారము, ధాన్యము, వెండి, దేవాలయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H214, H618, H624, H4035, H4200, H4543, G596