te_tw/bible/other/snare.md

4.9 KiB
Raw Permalink Blame History

వల , వలలో వేసుకొను, వలపన్ను, బోను, బోనులో పడడం, పడుగొయ్యి

నిర్వచనము:

“వల” మరియు “బోను” అనే ఈ పదములు జంతువులను పట్టుకొనుటకు మరియు అవి తప్పించుకొనకుండ ఉండుటకు ఉపయోగించే పరికరాలై ఉన్నవి. “బోను” లేక “చిక్కించుకొను” అనగా చిన్నబోనుతో పట్టుకొనుట అని అర్థము, మరియు “ఉచ్చు” లేక “వలపన్ను" అనగా ఉచ్చుతో పట్టుకొనుట అని అర్థము. పరిశుద్ధ గ్రంథములో ప్రజలను పట్టుకొని, వారికి హాని చేయు పాపము మరియు శోధనలు గూర్చి మరుగైనవి ఉచ్చులాంటివని చెప్పుటకు ఈ పదాలు అలంకారికముగా ఉపయోగించబడినవి.

  • “వల” అనేది ఒక ప్రాణి వచ్చి అందులో కాలు పెట్టినప్పుడు ఆకస్మికముగా వెంటనే పట్టుకొనేందుకు తయారు చేసిన తాడు లేక తీగయైయున్నది.
  • “బోను” అనేది సాధారణముగా లోహముతోను లేక చెక్కతోను చేసెదరు. ఇందులో రెండు భాగాలు ఉంటాయి, ఇవి రెండు ఆకస్మికముగాను గట్టిగా దగ్గరికి వస్తాయి, తద్వారా ప్రాణిని పట్టుకొని దానిని బయటకు వెళ్ళకుండా బిగపట్టుకుంటాయి. కొన్నిమార్లు బోను అనేది కొన్నిటిని పట్టుకొనుటకు నేల మీద త్రవ్విన పెద్ద గుంతగా కూడా ఉంటాయి.
  • సాధారణముగా చిన్నబోను లేక ఉచ్చు అనేది మరుగై ఉంటాయి. తద్వారా వేట ఆశ్చర్యపోతుంది.
  • “ఉచ్చును సిద్దపరచుట/ఉరియోడ్డుట” అనగా దేనినైనా పట్టుకొనుటకు ఉచ్చును సిద్దపరచుట అని అర్థము.
  • “ఉచ్చులో పడుట” అనునది ప్రాణులను పట్టుకొనుటకు త్రవ్వి మరుగుగా ఉంచిన గుంతలోనికైనా లేక లోతైన రంద్రములోనికైన పడుటను సూచిస్తుంది.
  • ఒక వ్యక్తి పాపము చేయుటను ప్రారంభించి, దానిని విడువక ముందుకు కొనసాగించునట్లయితే, ఒక ప్రాణిని పట్టుకొని అది ఎక్కడికి తప్పించుకొనకుండా చేస్తామో అదే విధముగా ఆ మనుష్యుని “పాపము ద్వారా బంధించబడియున్నాడు” అని వాక్యము సెలవిస్తోంది.
  • ఒక ప్రాణి ఉచ్చులో లేక వలలో చిక్కుకొని అపాయానికి మరియు హానికి గురిచేయబడిందో, అలాగే ఒక వ్యక్తి పాపపు ఉచ్చులో లేక వలలో చిక్కుకొని, హానికి గురయ్యాడని మరియు తనకు విడుదల అవసరమని దాని అర్థము.

(ఈ పదములను కూడా చూడండి: free, prey, Satan, tempt)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2256, H3353, H3369, H3920, H3921, H4170, H4204, H4434, H4685, H4686, H4889, H5367, H5914, H6341, H6351, H6354, H6679, H6983, H7639, H7845, H8610, G00640, G23390, G23400, G38020, G38030, G39850, G46250