te_tw/bible/other/sackcloth.md

3.2 KiB
Raw Permalink Blame History

గోనెపట్ట

నిర్వచనము:

గోనెపట్ట అనునది ముతక నేతగల, ఒంటె వెంట్రుకలనుండైన లేక మేక వెంట్రుకల నుండి చేసిన గరుకు గరుకులుగా ఉన్నటువంటి ఒక విధమైన బట్ట.

  • దీనినుండి చేయబడిన బట్టను ధరించుకొనిన వ్యక్తి చాలా అనానుకూలముగా ఉంటుంది. గోనెపట్టను విలాపమును, దుఃఖమును లేక తగ్గింపుతో కూడిన పశ్చాత్తాపమును చూపించుటకు ధరించుకొందురు.
  • “గోనెపట్ట మరియు బూడిద” అనే ఈ మాట సర్వ సాధారణమైన మాట, ఇది సంప్రదాయముగా పశ్చాత్తాపమును మరియు దుఃఖమును వ్యక్తపరచుటకు సూచించబడియుండెను.

అనువాదం సూచనలు:

  • ఈ పదమును “ప్రాణుల వెంట్రుకలనుండి చేసిన ముతక బట్ట” లేక “మేక వెంట్రుకలనుండి చేసిన బట్టలు” లేక “గరుకు గరుకుగా ఉన్న దట్టమైన బట్ట” అని కూడా తర్జుమా చేయుదురు.
  • ఈ పదమును తర్జుమా చేయుటకు వేరొక విధానములో “గరుకు గరుకుగా ఉన్నటువంటి విలాప వస్త్రాలు” అని కూడా చెప్పుదురు.
  • “గోనెపట్టలొనూ మరియు బూడిదలోను కూర్చొనుట” అనే ఈ మాటను “బూడిదలో కూర్చొని, గోనెపట్టను ధరించుకొనుట ద్వారా విలాపమును మరియు తగ్గింపును చూపించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(దీనిని కూడా చూడండి: తెలియని వాటిని ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ash, camel, goat, humble, mourn, repent, sign)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H8242, G45260