5.5 KiB
5.5 KiB
సూచక క్రియ, సూచక క్రియలు, నిరూపణ, జ్ఞప్తి చేయుట
నిర్వచనము:
సూచక క్రియ అనునది ఒక విశేషమైన అర్థమును తెలియజేసే ఒక సంఘటన, ఒక విషయము, లేక ఒక క్రియయైయున్నది
- “జ్ఞాపకాలు” అనేవి ప్రజలు కొన్నిటిని జ్ఞాపకము చేసికొనుటకు విశేషముగా అనేకమార్లు వాగ్ధానము చేయబడిన వాటినిగూర్చి జ్ఞాపకము చేసికొనుటకు సహాయము చేయుట ద్వారా ప్రజలకు “జ్ఞాపకము” చేసే సూచక క్రియలుయైయున్నవి.
- దేవుడు ఆకాశములో సృష్టించిన ఇంద్రధనస్సు అనేది ఒక సూచక క్రియయైయున్నది, ఇది దేవుడు ఇంకెప్పటికీ ప్రపంచమంతటిని ప్రళయము ద్వారా మనుష్యులను నాశనము చేయనని చెప్పిన వాగ్ధానమును ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నది.
- దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు సూచనగా వారి కుమారులందరు సున్నతి చేయించుకోవాలని ఆయన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను.
- సూచక క్రియలు దేనిని గూర్చియైన విషయాన్ని తెలియజేస్తాయి లేక దేనినిగూర్చియైన ఎత్తి చూపుతాయి.
- బెత్లెహేములో జన్మించిన శిశువును మెస్సయ్యాగా ఎలా గుర్తించాలనే ఆనవాళ్ళను దూత గొర్రెల కాపరులకు తెలియజేసెను.
- మత నాయకులు బంధించాలనుకున్న యేసును బంధించుటకు యూదా ఒక సూచనగా యేసు నుదుటిపైన ముద్దు పెట్టెను.
- సూచక క్రియలు ఏదైనా ఒక విషయము నిజమని నిరూపిస్తాయి.
- ప్రవక్తల ద్వారా మరియు అపొస్తలుల ద్వారా జరిగిన మహత్కార్యములన్నియు వారు మాట్లాడుచున్నది దేవుని సందేశమని నిరూపించే సూచక క్రియలైయుండెను.
- యేసు చేసిన మహత్కార్యములన్నియు ఆయన నిజముగా మెస్సయ్యేనని నిరూపించిన సూచకక్రియలైయున్నవి.
తర్జుమా సలహాలు:
- సందర్భానుసారముగా ‘సూచక క్రియ” అనే పదమును “సైగ” లేక “గురుతు” లేక “మార్కు” లేక “ఆధారము” లేక “నిరూపణ” లేక “సంజ్ఞ” అని కూడా తర్జుమా చేయుదురు.
- “చేతులతో సూచక క్రియలు చేయుట’ అనే ఈ మాటను “చేతులతో చేసే చలనము” లేక “చేతులతో చేసే సంజ్ఞ” లేక “సంజ్ఞలు చేయుము” అని కూడా తర్జుమా చేయుదురు.
- కొన్ని భాషలలో దేనినైనా నిరూపించే “సూచక క్రియ” కొరకు బహుశ ఒకే పదము ఉండిఉండవచ్చు మరియు “సూచకక్రియ” కొరకు ఇంకొక పదము మహత్కార్యము అని చెప్పవచ్చును.
(ఈ పదములను కూడా చూడండి:miracle, apostle, Christ, covenant, circumcise)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.02:18-19
- నిర్గమ.04:8-9
- నిర్గమ.31:12-15
- ఆది.01:14-15
- ఆది.09:11-13
- యోహాను.02:17-19
- లూకా.02:10-12
- మార్కు.08:11-13
- కీర్తన.089:5-6
పదం సమాచారం:
- Strong’s: H0226, H0852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G03640, G08800, G12130, G12290, G17180, G17300, G17320, G17700, G39020, G41020, G45910, G45920, G49530, G49730, G52800