te_tw/bible/kt/repent.md

6.3 KiB
Raw Permalink Blame History

పశ్చాత్తాపపడు, పశ్చాత్తాపము

నిర్వచనము:

“పశ్చాత్తాపపడు” మరియు “పశ్చాత్తాపము” అనే ఈ పదములు పాపమునుండి వెనుదిరుగుటను గూర్చి మరియు దేవుని వైపుకు తిరుగుటను గూర్చి సూచించును.

  • “పశ్చాత్తాపపడుట” అనే మాటకు “ఒకరి మనస్సును మార్చుకొనుట” అని అక్షరార్థము కలదు.
  • పరిశుద్ధ గ్రంథములో “పశ్చాత్తాపపడు” అనే మాటకు సాధారణముగా మానవ ఆలోచన విధానము, క్రియల విధానం విధానమునుండి మరియు పాప స్వభావమునుండి బయటకు వచ్చి, దేవుని విధానములో ఆలోచించుట, క్రియలు చేయు వైపునకు మరలుట అని అర్థము.
  • ప్రజలు తమ పాపముల విషయమై నిజంగా పశ్చాత్తాపము చెందినప్పుడు, దేవుడు వారిని క్షమించి, ఆయనకు విధేయులు లగునట్లు వారికి సహాయము చేస్తాడు.

అనువాదం సలహాలు:

  • “పశ్చాత్తాపపడు” అనే ఈ మాటను “(దేవుని వైపుకు) తిరుగుకొనుము” లేక “పాపమునుండి మరలి దేవుని వైపుకు తిరుగుకొనుట” లేక “దేవుని వైపుకు తిరుగుట, పాపమునుండి మరలుట” అని అర్థములనిచ్చే మాటలతో లేదా పడభందంతో అనువదించవచ్చును.
  • అనేకమార్లు “పశ్చాత్తాపము” అనే ఈ పదము “పశ్చాత్తాపపడు” అనే క్రియా పదముగా అనువాదం  చేయబడుతుంది. ఉదాహరణకు, “దేవుడు ఇశ్రాయేలుకు పశ్చాత్తాపమును ఇచ్చియున్నాడు” అనే ఈ మాటను “దేవుడు ఇశ్రాయేలు పశ్చాత్తాపపడునట్లు చేసియున్నాడు” అని అనువాదం  చేయుదురు.
  • “పశ్చాత్తాపము” అనే ఈ పదమును అనువాదం చేయు వేరొక విధానములో “పాపమునుండి వెనుదిరుగుట” లేక “దేవుని వైపుకు తిరిగి, పాపమునుండి తప్పుకొనుట” అనే మాటలు కూడా వినియోగిస్తారు.

(ఈ పదములను కూడా చూడండి: sin, turn)

బైబిలు రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __16:2__దేవునికి అవిధేయత చూపించి అనేక సంవత్సరములైన తరువాత, వారి శత్రువులు ద్వారా నలగగొట్టబడిన తరువాత, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపము పొందిరి మరియు తమను రక్షించమని దేవునిని వేడుకొనిరి.
  • 17:13

దావీదు తన పాపమునుబట్టి పశ్చాత్తాపపడ్డాడు, దేవుడు అతనిని క్షమించాడు.

  • __19:18__ప్రజలు పశ్చాత్తాపపడకపోతే దేవుడు వారిని నాశనము చేయునని వారు (ప్రవక్తలు) వారిని హెచ్చరించారు.
  • __24:2__అనేకమది ప్రజలు యోహాను ప్రకటించే మాటలను వినుటకు అరణ్యమునకు తరలివచ్చిరి. “దేవుని రాజ్యము సమీపించియున్నది, పశ్చాత్తాపపడుడి“ అని అతడు వారికి చెప్పుచూ ప్రకటించెను!
  • 42:8 “ప్రతియొక్కరు తమ పాపముల కొరకై పాప క్షమాపణ పొందుటకు ప్రతియొక్కరు పశ్చాత్తాపపడాలి అని నా శిష్యులు ప్రకటించుదురని లేఖనములలో వ్రాయబడియున్నది.”
  • 44:5 “అందుచేత ఇప్పుడు పశ్చాత్తాపపడుడి మరియు దేవునివైపుకు తిరుగుడి, తద్వారా మీ పాపములు కడుగబడుతాయి.”

పదం సమాచారం:

  • Strong's: H5150, H5162, H5164, G02780, G33380, G33400, G33410