6.3 KiB
6.3 KiB
స్వీకరించు, స్వాగతం, చేపట్టిన, అంగీకారం
నిర్వచనం:
“స్వీకరించు లేక పొందుకొను" పదం సాధారణంగా ఇచ్చిన, అర్పించిన లేదా అందించిన దానిని పొందడం లేదా అంగీకరించడం అని అర్థం.
- “ఒక వ్యక్తి తాను చేసిన పనికి శిక్షను అతడు పొందుకొన్నాడు" లో ఉన్నట్టుగా "స్వీకరించడం లేదా పొందుకోవడం" పదం దేనినైనా అనుభవించడం లేదా శ్రమనొందడం అనే అర్థం కూడా వస్తుంది.
- మనం ఒక వ్యక్తిని మనం “స్వీకరిస్తున్నాము" అనే దానిలో కూడా ఒక ప్రత్యేక భావన ఉంది. ఉదాహరణకు, సందర్శకులనూ లేదా అతిథులనూ “స్వీకరించడం” అంటే వారితో ఒక సంబందాన్ని పెంచుకోవడం కోసం గౌరవంతో వారిని స్వాగతిస్తాము, గౌరవిస్తాము.
- పరిశుద్ధాత్మ వరమును పొందుకొనుట” అంటే మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడియున్నాడు, మన జీవితములలోనూ, మన జీవితముల ద్వారానూ పనిచేయుటకు ఆయనను ఆహ్వానించాలి అని అర్థం.
- “యేసును స్వీకరించడం” అంటే యేసు క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షణను అంగీకరించడం అని అర్థం.
- ఒక చూపులేని వ్యక్తి “తన చూపును పొందుకొనినప్పుడు” అంటే దేవుడు అతనిని స్వస్థపరిచాడు, చూడడానికి అతనిని బలపరిచాడు అని అర్థం.
అనువాదం సూచనలు:
- సందర్బాన్ని బట్టి “స్వీకరించడం" పదం "అంగీకరించం" లేదా "స్వాగతించడం" లేదా "అనుభవించడం" లేదా "ఇవ్వబడడం" అని అనువదించబడవచ్చు.
- "మీరు శక్తి పొందుదురు" వాక్యం "మీకు శక్తి ఇవ్వబడుతుంది" లేదా "దేవుడు మీకు శక్తిని ఇస్తాడు" లేదా "శక్తి మీకు (దేవుని ద్వారా) ఇవ్వబడుతుంది" లేదా పరిశుద్ధాత్ముడు మీలో శక్తివంతంగా పనిచేసేలా దేవుడు చేస్తాడు" అని నువదించబడవచ్చు.
- "తన చూపును పొందాడు" పదబంధం "చూడగలిగాడు" లేదా "తిరిగి చూడగలిగాడు" లేదా దేవుని స్వస్థత పొందాడు తద్వారా చూడగలిగాడు" అని అనువదించబడవచ్చు.
(చూడండి: Holy Spirit, Jesus, lord, save)
బైబిలు రిఫరెన్సులు:
- 1యోహాను 5:9
- 1 తెస్సా 1:6
- 1 తెస్సా 4:1
- అపో.కా 8:15
- యిర్మియా 32:33
- లూకా 9:5
- మలాకీ 3:10-12
- కీర్తన 49:14-15
బైబిలు కథలనుండి ఉదాహరణలు:
- __21:13__ప్రవక్తలు కూడా మెస్సీయా పరిపూర్ణుడు, పాపం లేనివాడు అని చెప్పారు. ఆయన మనుష్యులందరి పాపం కోసం శిక్షను తీసుకోవడం కోసం చనిపోయాడు. ఆయన పొందిన శిక్ష దేవునికీ మనుష్యులకు మధ్య సమాధానాన్ని తీసుకొని వచ్చింది.
- 45:5 స్తెఫను చనిపోతున్నప్పుడు అతడు గట్టిగా అరిచాడు, "యేసూ, నా ఆత్మను స్వీకరించు.”
- __49:6__ఆయన (యేసు) కొందరు ఆయనను స్వీకరిస్తారనీ, రక్షణ పొందుతారనీ చెప్పాడు అయితే కొందరు స్వీకరించారు.
- __49:10__యేసు సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన శిక్షను స్వీకరించాడు.
- __49:13__యేసు నందు విశ్వాసం ఉంచి ఆయనను తమ ప్రభువుగా స్వీకరించిన ప్రతిఒక్కరినీ దేవుడు రక్షిస్తాడు.
పదం సమాచారం:
- Strong’s: H3557, H3947, H6901, H6902, H8254, G03080, G03240, G03530, G03540, G05680, G05880, G06180, G11830, G12090, G15230, G16530, G19260, G28650, G29830, G30280, G33350, G33360, G35490, G38580, G38800, G43270, G43550, G43560, G46870, G52640, G55620