te_tw/bible/other/qualify.md

3.3 KiB

అర్హత పొందు, అర్హమైనది, అనర్హమైనది

నిర్వచనము:

“అర్హత పొందు” అనే ఈ పదము కొన్ని నిర్దిష్టమైన నైపుణ్యతలను పొందియున్నాడని గుర్తించబడుటకును లేక కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనములను పొందుకొనుటకు హక్కును సంపాదించుటను సూచించును.

  • ఒక ప్రత్యేకమైన ఉద్యోగము కొరకు “అర్హతపొందిన” ఒక వ్యక్తి అవసరమైన నైపుణ్యతలను మరియు ఆ ఉద్యోగము చేయుటకు తర్ఫీదును కలిగియుంటాడు.
  • అపొస్తలుడైన పౌలు కొలొస్సయులకు వ్రాసిన తన పత్రికలో దేవుడు తన వెలుగు సంబంధమైన రాజ్యములో విశ్వాసులందరు పాల్గొనునట్లు వారిని “అర్హులనుగా” చేసియున్నాడని వ్రాసియున్నాడు. ఈ మాటకు వారు దైవిక సంబంధమైన జీవితమును జీవించుటకు వారిని కావలసిన ప్రతీది ఇచ్చియున్నాడని అర్థము.
  • విశ్వాసి దేవుని రాజ్యములో పాలిభాగస్థునిగా ఉండే హక్కును సంపాదించలేడు. ఆయన మాత్రమె అర్హులనుగా చేస్తాడు ఎందుకంటే దేవుడు క్రీస్తు రక్తముతో అతనిని విమోచించియున్నాడు.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా “అర్హమునొందినది” అనే ఈ మాటను “బలపరచబడినది” లేక “నైపుణ్యతకలది” లేక “శక్తిపొందినది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఎవరినైనా “అర్హులనుగా” చేయుట అనే ఈ మాటను “బలపరచుట” లేక “శక్తినిచ్చుట” లేక “అధికారమునిచ్చుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: కొలొస్స, దైవికత, రాజ్యము, వెలుగు, పౌలు, విమోచించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3581