te_tw/bible/other/light.md

4.7 KiB
Raw Permalink Blame History

వెలుగు, తేజస్సు, మెరుపు, ప్రకాశింప జేయు, జ్ఞానంకలిగించడం

నిర్వచనం:

“వెలుగు” అనే పదం బైబిల్లో వివిధ మార్గాల్లో అలంకారికంగా ఉపయోగించబడింది. కాంతి అనే పదం తరచుగా జ్ఞానం, జీవితం, ధర్మం, సత్యం లేదా ఆనందానికి రూపకం వలె ఉపయోగించబడుతుంది.

  • తాను దేవుని నిజమైన సందేశాన్ని ప్రపంచానికి తీసుకువస్తానని మరియు ప్రజలను వారి పాపపు చీకటి నుండి రక్షిస్తానని వ్యక్తపరచడానికి “నేను ప్రపంచానికి వెలుగుని” అని యేసు చెప్పాడు.
  • క్రైస్తవులు "వెలుగులో నడవండి" అని ఆజ్ఞాపించబడ్డారు, అంటే వారు దేవుడు కోరుకున్న విధంగా జీవించాలి మరియు చెడుకు దూరంగా ఉండాలి.
  • అపొస్తలుడైన యోహాను “దేవుడు వెలుగైయున్నాడు” మరియు ఆయనలో చీకటి లేనే లేదు అని చెప్పాడు.
  • తాను “లోకమునకు వెలుగు” అని, దేవుడు ఎంత గొప్పవాడో స్పష్టంగా చూపించే విధంగా జీవించడం ద్వారా తన అనుచరులు లోకంలో వెలుగులుగా ప్రకాశించాలని యేసు చెప్పాడు.
  • “వెలుగులో నడవడం” అంటే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడం, మంచి మరియు సరైనది చేయడం. చీకటిలో నడవడం అనేది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చెడు పనులు చేయడం.

అనువాదం సూచనలు:

  • అనువాదం చేసేటప్పుడు, “వెలుగు” “చీకటి” అనే పదాలు రూపకాలంకారంగా వినియోగించబడినప్పటికీ వీటిని అక్షరార్ద పదాలను ఉంచడం ప్రాముఖ్యం.
  • వచనభాగంలో ఉన్న పోలికను వివరించడం అవసరం. ఉదాహరణకు, “వెలుగు సంబంధులవలే నడుచుకొనుడి” అను వాక్యం ప్రకాశమైన సూర్యుని కాంతిలో ఒకరు నడచిన విధంగా “నీతి జీవితాలను నిష్కపటంగా జీవించండి” అని అనువదించవచ్చు.
  • ”వెలుగు”ను అనువదించేటప్పుడు, దీపం వంటి వెలుగును ఇచ్చే వస్తువును సూచించేదిగా ఉండకూడదు. ఈ పదం అనువాదం దాని వెలుగును సూచించాలి.

(చూడండి: darkness, wisdom, life, righteous, true, joy)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0216, H0217, H3313, H3974, H5051, H5094, H5105, H5216, H7837, G06810, G07960, G16450, G29850, G30880, G53380, G54570, G54580, G54600, G54620