te_tw/bible/other/nation.md

5.5 KiB

జాతి

నిర్వచనం:

జాతి అనగా ఏదైనా ఒక ప్రభుత్వ విధానము చేత పాలించబడే అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు. దేశంలోని ప్రజలందరూ ఎక్కువశాతం ఒకే పూర్వికులను కలిగియుంటారు, ఒకే స్వజాతీయతను కలిగియుంటారు.

  • ఒక “జాతి” సాధారణంగా చక్కగా నిర్వచనియమైన సంస్కృతినీ, రాజ్యసంబంధమైన సరిహద్దులను కలిగియుంటుంది.
  • బైబిలులో ఒక “జాతి/దేశము” (ఐగుప్తు లేక ఐతియోపియా వలె) ఒక దేశంగా ఉండవచ్చు, అయితే తరచూ సాదారణంగా మరియు ఒక జాతికి/ప్రజల గుంపుకు సూచిస్తున్నది, ప్రత్యేకించి బహువచనంగా ఉపయోగించిన్నప్పుడు. సందర్భాన్ని పరీక్షించడం/దృష్టిలో ఉంచుకోవడం ప్రాముఖ్యం.
  • బైబిలులోని ఉన్న జాతులలో ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు, అశ్షురియులు, బబులోనీయులు, కనానీయులు, రోమీయులు, గ్రీసుదేశీయులు/గ్రేకీయులు మొదలైనవారు ఉన్నారు.
  • కొన్నిసార్లు “జాతి” అనే పదం ఒక గుంపు ప్రజల పితరుడిని సూచించడానికి రూపకాలంకారంగా/అలంకారికంగా  వినియోగించబడుతుంది, ఉదాహరణకు - రిబ్కాకు గర్భంలోని బిడ్డలు ఒకరితో ఒకరు పెనుగులాడుకునే రెండు “జాతులు/జనాంగాలు” ఉన్నారని దేవుడు చెప్పాడము/లో మనం దీనిని చూస్తాం. దీనిని “రెండు జాతుల సంస్థాపకులు/కర్తలు ” లేక “రెండు గుంపుల పితరులు” అని అనువదించవచ్చు.
  • “జాతి” అనే పదము యొక్క అనువాదం కొన్నిసార్లు “అన్యజనులు” లేక “యెహోవాను పూజించని/సేవించని ప్రజలను సూచిస్తుంది. సందర్భం దాని అర్థాన్ని స్పష్టం చేస్తుంది.

అనువాదం సలహాలు :

  • సందర్భాన్ని బట్టి, “జాతి” అనే పదాన్ని “ప్రజా గుంపు” లేక “ప్రజలు” లేక “దేశం” అని అనువదించవచ్చు.
  • ఒక భాషలో “జాతి” అనే పదమునకు ఇతర మిగిలిన పదాలన్నిటికీ భిన్నంగా ఉండే పదం ఉంటే, ప్రతీ సందర్భంలో ఆ పదం సహజంగానూ, ఖచ్చితంగానూ ఉన్నంతవరకూ బైబిలు భాగంలో ప్రతీసారీ ఉపయోచించవచ్చు.
  • ”జాతులు” అనే బహువచన పదాన్ని “ప్రజల గుంపులు” అని అనువదించవచ్చు.
  • కొన్ని నిర్దిష్ట సందర్భాలలో, ఈ పదాన్ని “అన్యజనులు” లేక “యూదేతరులు” అని కూడా అనువదించవచ్చు.

(చూడండి: Assyria, Babylon, Canaan, Gentile, Greek, people group, Philistines, Rome)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0523, H0524, H0776, H1471, H3816, H4940, H5971, G02460, G10740, G10850, G14840