te_tw/bible/kt/gentile.md

2.6 KiB
Raw Permalink Blame History

అన్యజనుడు

వాస్తవాలు:

"అన్యజనుడు" పదం యూదుడు కాని వానిని సూచిస్తుంది. యూదేతరులు అంటే యాకోబు సంతానం కానీ వారు.

  • బైబిలులో "సున్నతి లేని ప్రజలు" పదం కూడా రూపకంగా అన్యజనులను సూచించడానికి ఉపయోగించబడింది. ఎందుకంటే వారిలో అనేకమంది ఇశ్రాయేలీయులు చేసిన విధంగా తమ మగపిల్లలకు సున్నతి చెయ్యలేదు.
  • దేవుడు యూదులను తన ప్రత్యేక ప్రజలుగా ఎన్నుకొన్న కారణంగా వారు అన్యజనులను ఎప్పటికీ దేవుని ప్రజలుగా ఉండలేని వెలుపటి వారిగా తలంచారు.
  • యూదులు చరిత్రలో ఆయా సమయాలలో "ఇశ్రాయేలీయులు” లేక “హెబ్రీయులు" అని పిలువబడ్డారు. ఈ పదాలు మిగిలిన వారందరినీ "అన్యజనులు"గా సూచించాయి.
  • "అన్యజనుడు" పదం "యూడుడు కానివాడు" లేదా "యూదా మతస్థుడుకానివాడు" లేదా "ఇశ్రాయేలీయుడు కాని వాడు" లేదా "యూదేతరుడు" అని అనువదించబడవచ్చు.
  • సాంప్రదాయికంగా, యూదులు యూదేతరులతో కలవరు, కలిసి భోజనం చెయ్యరు. ఇది ఆదిమా సంఘంలో సమస్యలకు కారణం అయింది.

(చూడండి:Israel, Jacob, Jew)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1471, G14820, G14840, G16720