te_tw/bible/other/peoplegroup.md

9.2 KiB
Raw Permalink Blame History

ప్రజలు, ప్రజా గుంపు

నిర్వచనము:

“ప్రజలు” లేక “జనాంగములు” అను పదము ఒకే భాషను మరియు ఒకే సంస్కృతిని పంచుకునే జనుల గుంపును సూచిస్తుంది. “ప్రజా గుంపు” అను మాట అనేకమార్లు ఒక నిర్దిష్టమైన స్థలములో లేక ఒక విశేషమైన స్థలములో ప్రజలు కూడుకొనుటను సూచిస్తుంది.

  • దేవుడు “ప్రజా గుంపును” తనకొరకు ప్రత్యెకపరచుకొనినప్పుడు, ఆయనకు సేవ చేయుటకు మరియు ఆయనకు సంబందులుగా ఉండుటకు ఆ నిర్దిష్టమైన ప్రజల గుంపును ఎన్నుకొనియున్నాడని దాని అర్థము.
  • బైబిల్ప కాలములలో జనాంగములలోని ప్రజలందరూ సహజముగా ఒకే పితరులను కలిగియుంటారు మరియు ఒక నిర్దిష్టమైన ప్రాంతములో లేక ఒక దేశములో అందరు కలిసి జీవించినట్లుగా చూడగలము.
  • సందర్భానుగుణంగా “నీ ప్రజలు” అను మాటకు “నీ జనాంగము” లేక “నీ కుటుంబము” లేక “ నీ బంధువులు” అని అర్థము కలదు.
  • “ప్రజలు” అనే పదము అనేకమార్లు భూమి మీదనున్న జనుల జాతులన్నిటిని సూచించుటకు ఉపయోగించబడియున్నది. మరికొన్నిమార్లు ఈ పదము ఇస్రాయేలీయులుకాని వారిని ఎక్కువగా విశేషముగా సూచిస్తుంది లేక యెహోవను సేవించనివారిని సూచిస్తుంది. మరికొన్ని ఆంగ్ల బైబిల్ అనువాదములలో “దేశములు” అనే పదమును కూడా ఈ విధముగా ఉపయోగించబడియున్నది.

అనువాదం సూచనలు:

  • "ప్రజా గుంపు" అనే పదాన్ని "పెద్ద కుటుంబ సమూహం" లేదా "వంశం" లేదా "జాతి సమూహం" అనే పదం లేదా పదబంధం ద్వారా అనువదించవచ్చు.
  • “నా ప్రజలు” వంటి పదబంధాన్ని సందర్భాన్ని బట్టి “నా బంధువులు” లేదా “నా తోటి ఇశ్రాయేలీయులు” లేదా “నా కుటుంబం” లేదా “నా ప్రజల సమూహం” అని అనువదించవచ్చు.
  • “మిమ్మల్ని ప్రజల మధ్య చెదరగొట్టుదును” అనే వ్యక్తీకరణను “మీరు అనేక విభిన్న వ్యక్తుల సమూహాలతో కలిసి జీవించడం” లేదా “మీరు ఒకరి నుండి ఒకరు విడిపోయి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో నివసించేలా చేయడం” అని కూడా అనువదించవచ్చు.
  • “ప్రజలు” లేదా “ప్రజలు” అనే పదాన్ని సందర్భాన్ని బట్టి “ప్రపంచంలోని ప్రజలు” లేదా “ప్రజలు” అని కూడా అనువదించవచ్చు.
  • "ప్రజలు" అనే పదబంధాన్ని "నివసించే వ్యక్తులు" లేదా "ప్రజల నుండి వచ్చినవారు" లేదా "కుటుంబం" అని అనువదించవచ్చు, అది ఒక స్థలం లేదా వ్యక్తి యొక్క పేరు ద్వారా అనుసరించబడిందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
  • “భూమిపై నివసించే ప్రజలందరూ” లేదా “ప్రపంచంలోని ప్రతి వ్యక్తి” లేదా “ప్రజలందరూ” అని అనువదించవచ్చు.
  • “ప్రజలు” అనే పదబంధాన్ని “ప్రజల సమూహం” లేదా “కొన్ని వ్యక్తులు” లేదా “ప్రజల సంఘం” లేదా “ప్రజల కుటుంబం” అని కూడా అనువదించవచ్చు

(చూడండి: descendant, nation, tribe, world)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 14:02 దేవుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల సంతానమునకు వాగ్ధాన భూమిని ఇస్తానని ఆయన వారితో వాగ్ధానము చేసెను, కాని అక్కడ అనేక జనాంగములు నివసించుచుండెను.
  • 21:02 అబ్రహాము ద్వారా లోకములోని సమస్త జనాంగములన్నియు ఆశీర్వాదము పొందుకొంటారని దేవుడు తనతో వాగ్ధానము చేసెను. భవిష్యత్తులో మెస్సయ్యా వస్తాడు మరియు లోకములోని సమస్త జనాంగములన్నిటినుండి వచ్చే ప్రజలకు రక్షణ మార్గము అనుగ్రహిస్తాడనునదియే ఆశీర్వాదము.
  • 42:08 “సర్వమానవాళియు తాము చేసిన పాపములకొరకు క్షమాపణ పొందుకొనుటకు అందరు తప్పకుండ పశ్చాత్తాపము పొందాలని నా శిష్యులు ప్రకటించేదరు అని లేఖనములలో వ్రాయబడియున్నది. వారు ఈ సేవను యెరూసలేములోనుండి ఆరంభించేదరు, ఆ తదుపరి వారు ప్రతి జనాంగముల వద్దకు వెళ్ళెదరు.
  • 42:10 “అందుచేత, వెళ్లి, సమస్త జనాంగములను శిష్యులనుగా చేయండి, వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఆజ్ఞాపించినవాటినన్నిటిని వారికి బోధించి, వాటిని గైకొనవలేనని వారి బోధించుడి.”
  • 48:11 ఈ క్రొత్త నిబంధననుబట్టి ఎటువంటి జనాంగమునుండైనను ఎవరైనా యేసునందు విశ్వాసముంచుట ద్వారా దేవుని ప్రజలలో పాలిభాగస్థులు కావచ్చును.
  • 50:03 “వెళ్లి, సమస్త జనాంగములను శిష్యులనుగా చేయుడి!” మరియు “పంట కోయడానికి కోత కాలము వచ్చియున్నది!” అని ఆయన (యేసు) చెప్పెను.

పదం సమాచారం:

  • Strongs: H0249, H0523, H0524, H0776, H1121, H1471, H3816, H5712, H5971, H5972, H6153, G10740, G10850, G12180, G14840, G25600, G29920, G37930