te_tw/bible/other/courtyard.md

3.9 KiB
Raw Permalink Blame History

ఆవరణ, ఆవరణలు, బయటి ఆవరణ, బయటి ఆవరణలు

నిర్వచనం:

పదాలు "బయటి ఆవరణ” “ఆవరణ" అంటే చుట్టూ గోడలు కట్టిన బహిరంగ ప్రదేశం. ఈ పదం "ఆవరణ" అంటే చట్టపరమైన న్యాయ విచారణ జరిపించే స్థలం కూడా.

  • ప్రత్యక్ష గుడారం చుట్టూ ఒక బయటి ఆవరణ ఉంది. దీని చుట్టూ గోడలు కట్టి మందమైన గుడ్డ తెరలు అమర్చారు.
  • ఆలయం లో మూడు లోపలి, బయటి ఆవరణలు ఉన్నాయి: ఒకటి యాజకుల కోసం, ఒకటి యూదు పురుషులు, ఒకటి యూదు స్త్రీల కోసం.
  • ఈ లోపలి, బయటి ఆవరణల చుట్టూ తక్కువ ఎత్తున్న రాతి నేల ఉంటుంది. ఇది బయటి ఆవరణ నుండి యూదేతరులు ఆరాధించే ప్రదేశాన్ని వేరు చేస్తుంది.
  • ఇంటి బయటి ఆవరణ అంటే ఇంటి మధ్యలో బహిరంగ స్థలం.
  • పద బంధం "రాజు ఆవరణ" అంటే రాజు తన తీర్పులు వినిపించే భవనం లేక స్థలం.
  • " యెహోవా ఆవరణలు" అనేది అలంకారికంగా యెహోవా నివాస స్థలం లేదా ప్రజలు యెహోవాను ఆరాధించడానికి సమకూడే స్థలం.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "బయటి ఆవరణ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "చుట్టూ గోడలున్న ప్రదేశం” లేక “గోడలు కట్టిన నివేశన స్థలం” లేక “ఆలయం గచ్చు స్థలం” లేక “ఆలయం ప్రాంగణం."
  • కొన్ని సార్లు ఈ పదం "ఆలయం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆలయం బయటి ఆవరణలు” లేక “ఆలయం భవన సముదాయం." ఇందువల్ల బయటి ఆవరణలు అనేవి ఆలయం భవనం కాదు అని అర్థం అవుతుంది..
  • “యెహోవా ఆవరణలు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "యెహోవా నివసించే స్థలం” లేక “యెహోవాను ఆరాధించే స్థలం."
  • రాజు భవన ఆవరణను సూచించే ఈ పదాన్ని యెహోవా ఆవరణకోసం కూడా ఉపయోగిస్తారు.

(చూడండి: Gentile, judge, king, tabernacle, temple)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1004, H1508, H2691, H5835, H7339, H8651, G08330, G42590