te_tw/bible/other/beast.md

3.1 KiB

మృగం

వాస్తవాలు:

బైబిలులో "మృగం" పదం తరచుగా "జంతువు" అని మరొక విధంగా చెప్పడానికి ఉపయోగించారు.

  • క్రూర మృగం అంటే అడవిలో గానీ లేదా మైదానాలలో గానీ స్వేచ్ఛగా నివసించే జంతువు, మనుషుల చేత మచ్చిక చేయబడినది కాదు.
  • గృహసంబంధ మృగం మనుషులతో కలిసి నివసిస్తుంది. ఆహారం కోసం గానీ లేదా పొలం దున్నడం లాంటి పని చెయ్యడానికి ఉంచుతారు. "పశు సంపద" పదం తరచుగా ఇటువంటి జంతువులను సూచించడానికి ఉపయోగిస్తారు.
  • పాత నిబంధన దానియేలు గ్రంథం, కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం మృగాలు దేవుణ్ణి ఎదిరించే దుష్ట శక్తులూ, అధికారాలనూ సూచించే మృగాలు ఉన్న దర్శనాలను గురించి వివరిస్తున్నాయి. (చూడండి: రూపకం)
  • ఈ మృగాలు కొన్నిటిని విచిత్రమైన లక్షణాలున్నవిగా వర్ణించబడ్డాయి, అనేక శిరస్సులు, అనేక కొమ్ములు ఉండడం వంటివి. వాటికి తరచుగా శక్తి, అధికారం ఉంటాయి. అవి వివిధ దేశాలను జాతులను లేదా ఇతర రాజకీయ శక్తులను సూచిస్తాయి.
  • ఈ పదం "జీవి” లేదా “సృష్టించబడిన వస్తువు" లేదా "జంతువు" లేదా “క్రూర జంతువు," అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.

(చూడండి:authority, Daniel, livestock, nation, power, reveal, Beelzebul)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074