te_tw/bible/kt/reveal.md

4.3 KiB

బయలుపరచు, బయలు పరచబడడం, ప్రత్యక్షత

నిర్వచనం:

“బయలుపరచు” పదం ఏదైనా తెలియపరచబడడానికి కారణం కావడం అని అర్థం. “ప్రత్యక్షత” అంటే తెలియపరచబడినది అని అర్థం.

  • దేవుడు తాను సృష్టించిన ప్రతీ దాని ద్వారా తనను తాను బయలుపరచుకొన్నాడు, ప్రజలతో తాను మాట్లాడిన, లిఖిత పూర్వక సందేశాల ద్వారా బయలుపరచుకొన్నాడు.
  • దేవుడు తనను గూర్చి కలల ద్వారాను లేదా దర్శనముల ద్వారాను బయలుపరచుకొనియున్నాడు.
  • “యేసు క్రీస్తు నుండి ప్రత్యక్షత” ద్వారా సువార్తను తాను పొందుకొనియున్నానని పౌలు చెప్పినప్పుడు, యేసుక్రీస్తే స్వయాన తనకు సువార్తను గూర్చి వివరించియున్నాడని పౌలు అర్థం.
  • క్రొత్త నిబంధనలోని “ప్రకటన గ్రంథం" అంత్య కాలములో జరగబోయే సంభవాలను గూర్చి దేవుడు బయలుపరచాడు. దర్శనముల ద్వారా అపొస్తలుడైన యోహానుకు ఆయన బయలుపరచియున్నాడు.

అనువాదం సూచనలు:

  • “బయలుపరచు” పదం "తెలియపరచు" లేదా "బహిర్గతం చేయడం" లేదా "స్పష్టంగా చూపించడం" అనే పదాలతో ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, “ప్రత్యక్షత” పదం "దేవుని నుండి సమాచారం" లేదా "దేవుడు బయలుపరచిన సంగతులు" లేదా "దేవుని గురించిన బోధలు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు. అనువాదంలో "బయలుపరచు" అర్థం ఉండేలా చూడడం ఉత్తమం.
  • “ప్రత్యక్షత లేనప్పుడు” పదబంధం “దేవుడు తనను గూర్చి ప్రజలకు బయలుపరచనప్పుడు” లేదా “దేవుడు తన ప్రజలతో మాట్లాడనప్పుడు” లేదా “ప్రజల మధ్యలో సంభాషించని దేవుడు” అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: సువార్తసువార్తలుకలదర్శనం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H241, H1540, H1541, G601, G602, G5537