te_tw/bible/names/jehu.md

2.5 KiB

యెహూ

వాస్తవాలు:

యెహూ అనే పేరు పాత నిబంధనలో ఇద్దరికి ఉంది.

  • హనాని కుమారుడు యెహూ ప్రవక్త ఇశ్రాయేలు రాజు ఆహాబు, యూదా రాజు యెహోషాపాతు కాలంలో ప్రవచించాడు.
  • యెహోషాపాతు కుమారుడు (లేక సంతతి వాడు) యెహు ఇశ్రాయేలు సైన్యంలో అధికారి. ప్రవక్త ఎలీషా ఇతన్ని రాజుగా అభిషేకించాడు.
  • రాజు యెహూ ఇద్దరు దుష్టరాజులను ఇశ్రాయేలురాజు యెహోరామును యూదా రాజు అహజ్యాను సంహరించాడు.
  • యెహూ ఆహాబు రాజు, అతని దుష్టరాణి యెజెబెలు బంధువులను మట్టుబెట్టాడు.
  • రాజు యెహూ సమరయ బయలు ఆరాధన స్థలాలను నాశనం చేశాడు. బయలు ప్రవక్తలను చంపాడు.
  • యెహూ రాజు నిజ దేవుడు యెహోవాను సేవించాడు. అతడు ఇశ్రాయేలుపై ఇరవై-ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహాబు, అహజ్యా, బయలు, ఎలీషా, యెహోషాపాతు, యెహూ, యెజెబెలు, యెహోరాము, యూదా, సమరయ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3058