te_tw/bible/kt/inchrist.md

4.4 KiB

క్రీస్తులో, యేసులో, ప్రభువునందు, ఆయనలో

నిర్వచనం:

"క్రీస్తులో" పదము మరియు సంబంధిత పదాలు క్రీస్తులో విశ్వాసం ద్వారా ఆయనతో సంబంధంలో ఉండడం యొక్క స్థితిని లేదా షరతును సూచిస్తాయి.

  • ఇతర సంబంధిత పదాలు "క్రీస్తు యేసులో, యేసు క్రీస్తులో, ప్రభువైన యేసులో, ప్రభువైన యేసు క్రీస్తులో."
  • "క్రీస్తులో" పదానికి సాధ్యమయ్యే అర్ధాలలో ఇవి ఉంటాయి: "నీవు క్రీస్తుకు చెందియున్నావు కనుక” లేదా “క్రీస్తుతో నీకు ఉన్న సంబంధం ద్వారా” లేదా “క్రీస్తులో నీ విశ్వాసంమీద ఆధారపడి."
  • ఈ సంబంధిత పదాలు అన్నీ యేసులో విశ్వసించడం అనే స్థితిలో ఉండడం మరియు ఆయన శిష్యునిగా ఉండడం అనే ఒకే అర్థాన్ని కలిగియున్నాయి.
  • సూచన: కొన్ని సార్లు "లో " అనేది క్రియకు చెంది ఉంటుంది. ఉదాహరణకు, "క్రీస్తు’లో మహిమ’ అంటే అంటే యేసు ఎవరో, అయన ఏమి చేశాడో అనే దానికోసం సంతోషంగా ఉండడం మరియు దేవునికి స్తుతి చెల్లించడం అని అర్థం. "క్రీస్తు లో విశ్వసించడం” అంటే అయనను రక్షకునిగా నమ్మడం మరియు ఆయన యెరగడం.

అనువాదం సలహాలు:

  • సందర్భం ఆధారంగా వివిధ మార్గాలలో అనువదించడానికి "క్రీస్తులో,” మరియు “ప్రభువునందు" (సంబంధిత పద బంధాలు) పదాలలో ఇవి కలుపువచ్చు:
  • "క్రీస్తుకు చెందిన వారు"
  • "ఎందుకంటే నీవు క్రీస్తులో విశ్వసించావు"
  • "ఎందుకంటే క్రీస్తు మనలను రక్షించాడు"
  • "ప్రభువుకు సేవలో"
  • "ప్రభువుమీదా ఆధారపడడం"
  • "ప్రభువు చేసిన దాని కారణంగా"
  • క్రీస్తు’లో విశ్వసించిన’ ప్రజలు లేదా క్రీస్తులో "విశ్వాసం కలిగినవారు యేసు బోధించిన దానిని విశ్వసిస్తున్నారు మరియు వారిని రక్షించడానికి ఆయనను నమ్ముతున్నారు ఎందుకంటే సిలువ మీద ఆయన బలి అర్పణ ద్వారా వారి పాపాలకు శిక్ష చెల్లించబడింది. కొన్ని భాషలలో "విశ్వసించడం” లేదా  “వంతు పంచుకోవడం” లేదా “నమ్మకముంచడం” క్రియా పదాలను అనువదించడానికి ఒక్క పదం ఉండవచ్చు.

(చూడండి: క్రీస్తు, Lord, Jesus, believe, faith)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 యోహాను 02:05
  • 2 కొరింతి 02:16-17
  • 2 తిమోతి 01:01
  • గలతి 01:22
  • గలతి 02:17
  • ఫిలేమోను 01:06
  • ప్రకటన 01:10
  • రోమా 09:01

పదం సమాచారం:

  • Strong's: G1519, G2962, G5547