te_tw/bible/kt/body.md

4.6 KiB
Raw Permalink Blame History

శరీరం

నిర్వచనం:

ఈ పదం “శరీరం” అక్షరాలా ఒక వ్యక్తి లేక జంతువు భౌతిక శరీరాన్ని సూచిస్తున్నది. ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. ఇంగ్లీషులో బృందం అనే అర్థం వస్తుంది.

  • తరచుగా ”శరీరం” అనే ఈ పదం మనిషి, లేక జంతువు శవాన్ని సూచిస్తున్నది. కొన్ని సార్లు "మృత దేహం" లేదా ""పీనుగు"" అని సూచించబడుతుంది.
  • యేసు శిష్యులకు తన చివరి పస్కా భోజనం సమయంలో చెప్పాడు, " (రొట్టె) నా శరీరం,"ఇది వారి పాపాల వెల చెల్లించడానికి విరిగిపోనున్న (మరణించ బోతున్న) తన భౌతిక శరీరం."
  • బైబిల్లో, క్రీస్తు శరీరం అయిన క్రైస్తవుల సమూహాన్ని ఇది సూచిస్తుంది. * భౌతిక శరీరానికి అనేక భాగాలు ఉన్నాయి. అలానే "క్రీస్తు శరీరం"లో అనేకమంది వ్యక్తిగతంగా సభ్యులు ఉన్నారు.
  • వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి ప్రత్యేకంగా క్రీస్తు శరీరంలో విధులు ఉంటాయి. సమూహం సహాయంతో కలిసి పని చేసి దేవునికి మహిమ కలిగేలా ఆయన్ను సేవించాలి.
  • యేసు “శరీరానికి, అంటే తన విశ్వాసులకు శిరస్సు" (నాయకుడు). శిరస్సు తన శరీరానికి ఆజ్ఞలు ఇచ్చినట్టే యేసు తన "శరీరంలో అవయవాలు"అయిన క్రైస్తవులకు మార్గ దర్శకత్వం చేసి నడిపిస్తాడు.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని అనువదించడం లో అతి శ్రేష్టమైన మార్గం లక్ష్య భాషలో భౌతికశరీరం ఉపమానం ఉపయోగించడమే. ఈ పదం అభ్యంతరకరమైన పదం కాకుండా జాగ్రత్త పడండి.
  • మొత్తంగా విశ్వాసులను ఉద్దేశించి రాసేటప్పుడు కొన్ని భాషల్లో "ఆత్మ సంబంధమైన క్రీస్తు
  • యేసు "నా శరీరం,"అన్నప్పుడు దీన్ని అక్షరాలా అనువదించడం, అవసరమైతే ఒక వివరణ సాయంతో వివరించడం మంచిది.
  • కొన్ని భాషల్లో మృత దేహాన్ని సూచించడానికి “శవం” వంటి వేరే పదం ఉండవచ్చు. కాబట్టి ఆమోదయోగ్యమైన, అర్థ వంతమైన పదం ఉపయోగించడం మంచిది.

(చూడండి: head, hand; face; loins; righthand; tongue)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, H7607, G44300, G49540, G49830, G55590