te_tw/bible/other/loins.md

3.0 KiB
Raw Permalink Blame History

నడుము

నిర్వచనం:

“నడుము” అనే పదం ఒక జంతువు లేక మనిషి శరీరంలోని ఒక భాగాన్ని సూచిస్తుంది, అది క్రింది పక్కటెముకలు, తోదేముకల మధ్యలో ఉంది, దీనిని కింది పొత్తికడుపు అనికూడా అంటారు.

  • ”నడుము కట్టుకోండి” అనే వాక్యం కష్టపడి పనిచెయ్యడానికి సిద్ధపదండి అనే అర్థాన్ని ఇస్తుంది. ఒకని నిలువుటంగీ కింది భాగాన్ని నడుం చుట్టూ ఉన్న నడికట్టులో దోపడం అనే ఒక అలవాటు నుండి వచ్చింది.
  • ”నడుం” అనే పదం బలిగా అర్పించే జంతువు వెనుక కింది భాగాన్ని సూచించడానికి తరుచుగా బైబిల్లో వాడడం జరిగింది.
  • బైబిలులో “నడుం” అనే పదం మనిషి పునరుత్పత్తి కణాలు అతని సంతానానికి ఆధారంగా ఉపమానంగానూ, మృదువైన రీతిలోనూ తరుచుగా చెప్పడం జరిగింది. (చూడండి: అర్దాలంకారం)
  • ”నీ నడుం నుండి వచ్చును” అనే వాక్యం “నీ సంతానం అవుతుంది” లేక “నీ సంతానం నుండి జన్మిస్తుంది” లేక “నీ నుండి వచ్చేలా దేవుడు చేస్తాడు” అని అనువదించవచ్చు.
  • శరీరంలోని ఒక భాగాన్ని గురించి చెపుతున్నప్పుడు, సందర్భాన్ని బట్టి “పొత్తికడుపు” లేక “తొడలు” లేక “కటిప్రదేశం” అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి:descendant, gird, children)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2504, H3409, H3689, H4975, G37510