2.4 KiB
2.4 KiB
గంధకం, గంధకముతో
నిర్వచనము:
గంధకం అనేది పసుపు రంగులో ఉండే పదార్థము, దీనిని నిప్పు మీద ఉంచినప్పుడు మండే ద్రవంగా మారిపోతుంది.
- గంధకం కూడా కుళ్ళిపోయిన గుడ్ల వాసనవలె చాలా బలమైన వాసనను కలిగియుంటుంది.
- పరిశుద్ధ గ్రంథములో మండే గంధకము తిరుగుబాటు చేసే ప్రజలపైన మరియు అదైవికమైన ప్రజలమీద వచ్చే దేవుని న్యాయతీర్పుకు గురుతైయున్నది.
- లోతు సమయములో దేవుడు సొదొమ మరియు గొమొర్రాలు అనే దుష్ట పట్టణముల మీద గంధకమును మరియు అగ్నిని కురిపించాడు.
- కొన్ని ఆంగ్ల బైబిల్ అనువాదములలో గంధకమును “బ్రిమ్.స్టోన్” అని సూచించారు, దీనికి “మండించే రాయి” అని అక్షరార్థము.
తర్జుమా సలహాలు:
- ఈ పదమును తర్జుమా చేయు అనువాదములలో “మండించే పసుపు రాళ్లు” అని లేక “మండే పసుపు రంగు రాయి” అని కూడా ఉపయోగిస్తారు.
(ఈ పదములను కూడా చూడండి: గొమొర్ర, తీర్పు తీర్చు, లోతు, తిరస్కారము, సొదొమ, దైవికమైన)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H1614, G2303