te_tw/bible/other/rebel.md

5.5 KiB

తిరుగుబాటుదారు, తిరుగుబాటు, తిరగబడే, తిరుగబాటుతత్వం

నిర్వచనం:

“తిరుగుబాటుదారు (తిరుగుబాటు చేయి)” అంటే ఒకని అధికారానికి లోబడుటకు నిరాకరించడం అని అర్థం. "తిరగబడే" వ్యక్తి తరచుగా లోబడడు, చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి "ఒక తిరుగుబాటు దారుడు" అని పిలువాబడతాడు.

  • ఒక వ్యక్తి తనపై అధికారులు తాను చెయ్యకూడదని చెప్పినవాటిని చెయ్యడం ద్వారా తిరుగుబాటు చేస్తాడు
  • ఒక వ్యక్తి తనపై అధికారులు తాను చెయ్యవలసినదని చెప్పిన వాటిని నిరాకరించడం ద్వారా కూడా తిరుగుబాటు చేస్తాడు.
  • కొన్నిసార్లు ప్రజలు తమను పాలించే ప్రభుత్వానికీ లేదా నాయకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు.
  • “తిరుగుబాటు” పదం “అవిధేయత” లేదా “ఎదురు తిరగడం" అని సందర్భాన్ని బట్టి అనువదించబడవచ్చు.
  • “తిరగబడే” పదం “నిరంతరం అవిధేయత చూపడం" లేదా “విధేయత చూపించడానికి చూపుటకు తిరస్కరించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “తిరుగుబాటు” అంటే “విధేయత చూపుటకు తిరస్కరించడం” లేదా “అవిధేయత” లేదా “చట్ట ఉల్లంఘన” అని అర్థం.
  • “తిరుగుబాటు” లేదా “ఒక తిరుగుబాటు” పదం చట్టాన్ని ఉల్లంఘించడం, నాయకులమీదా, ఇతరప్రజల మీదా దాడి చెయ్యడం ద్వారా తమను పాలించు అధికారులకు వ్యతిరేకంగా బహిరంగ తిరుగుబాటు చేసే ఒక క్రమబద్దమైన ప్రజల గుంపును కూడా సూచిస్తుంది.

(చూడండి: అధికారం, అధిపతి)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 14:14 ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరములు అరణ్యంలో సంచరించిన తరువాత, వారిలో దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసిన వారందరు చనిపోయిరి.
  • 18:07 ఇశ్రాయేలు దేశపు పది గోత్రములు రెహబాముకు విరుద్ధముగా తిరుగుబాటు చేశారు.
  • 18:09 యెరోబాము దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసాడు, మరియు ప్రజలందరు పాపము చేయడానికి కారణం అయ్యాడు.
  • 18:13 యూదా ప్రజలందరిలో అనేకులు దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేశారు, మరియు ఇతర దేవుళ్ళను కూడా పూజించిరి.
  • 20:07 అయితే కొన్ని సంవత్సరములైన తరువాత, యూదా రాజ్యము బబులోనుకు విరుద్ధముగా తిరుగుబాటు చేసింది.
  • 45:03 “మూర్ఖులు, తిరుగుబాటు చేయు ప్రజలు దేవునిని తిరస్కరించి, ప్రవక్తలను చంపిన మీ పితరులవలె మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను తిరస్కరిస్తారు.

పదం సమాచారం:

  • Strong's: H4775, H4776, H4777, H4779, H4780, H4784, H4805, H5327, H5627, H5637, H6586, H6588, H7846, G3893, G4955