te_tw/bible/names/gomorrah.md

2.2 KiB

గొమొర్రా

వాస్తవాలు:

గొమొర్రా సారవంతం అయిన సోదోమ లోయ భూమిలో ఉన్న పట్టణం. అబ్రాహామును విడిచి లోతు నివాసం కోసం ఎన్నుకొన్నాడు.

  • గొమొర్రా, సోదోమ కచ్చితంగా ఎక్కడున్నదో తెలియదు. అయితే ఇది నేరుగా ఉప్పు సముద్రానికి దక్షిణంగా సిద్దిము లోయ దగ్గర ఉండవచ్చు.
  • సోదోమ గొమొర్రా ప్రాంతాలు అనేక మంది రాజులు యుద్ధాలు చేశారు.
  • లోతు కుటుంబం సోదోమ, ఇతర పట్టణాల సంఘర్షణలో చిక్కుకున్నప్పుడు అబ్రాహాము తన మనుషులతో వెళ్లి వారిని రక్షించాడు.
  • ఆ తరువాత కొంత కాలానికే సోదోమ, గొమొర్రాలను దేవుడు నాశనం చేశాడు. ఎందుకంటే అక్కడి ప్రజల దుర్మార్గత మితి మీరి పోయింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, బబులోను, లోతు, ఉప్పు సముద్రం, సోదోమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6017