te_tw/bible/kt/godly.md

6.2 KiB

దైవభక్తిగల, దైవభక్తి, దైవభక్తిలేని, దేవుడులేని, దైవభక్తిలేని, దేవుడులేని స్థితి

నిర్వచనం:

"దైవభక్తిగల" పదం దేవునికి ఘనత కలిగేలా ప్రవర్తిస్తూ, దేవుడెలా ఉంటాడో చూపే వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడుతుంది. "దైవభక్తి" అనేది దేవుని చిత్తం ప్రకారం చేయడం ద్వారా ఆయన్ని ఘనపరిచే గుణలక్షణం.

  • దైవభక్తి స్వభావం కలిగిన వ్యక్తి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం లాంటి ఆత్మ ఫలాన్ని కలిగియుంటాడు.
  • దైవభక్తిగుణం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగియున్నాడనీ, ఆయనకు లోబడుతున్నాడనీ చూపిస్తుంది.

"దైవభక్తిలేని," "దేవుడు లేని" పదాలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రజలను వివరిస్తున్నాయి. దుష్టమార్గంలో జీవిస్తూ, దేవుని గురించిన ఆలోచనలేకుండా ఉండడం "దైవభక్తిలేని" లేదా "దేవుడులేని స్థితి" అని పిలువబడుతుంది.

  • ఈ మాటలకున్న అర్థాలన్నీ ఒకేలా ఉన్నాయి. అయితే "దేవుడులేని" "దైవభక్తిలేని స్థితి" పదాలు దేవుణ్ణి కనీసం గుర్తించకుండా లేదా వారిని పాలించడంలో ఆయన హక్కును గుర్తించని ప్రజల లేదా దేశాలు ఉన్న తీవ్రమైన స్థితిని వివరిస్తున్నాయి.
  • తననూ, తన మార్గాలనూ తిరస్కరించే భక్తి హీన ప్రజలందరిమీద దేవుడు తీర్పునూ, ఆగ్రహాన్నీ ప్రకటిస్తున్నాడు.

అనువాదం సూచనలు:

  • "దైవభక్తిగల" పదం "దైవభక్తిగల ప్రజలు" లేదా "దేవునికి లోబడే ప్రజలు" అని అనువదించబడవచ్చు. (చూడండి: nominaladj)

  • "దైవ భక్తిగల" విశేషణం "దేవునికి విధేయుడు” లేదా "నీతిమంతుడు" లేదా "దేవునికి ఇష్టమైన" అని అనువదించబడవచ్చు.

  • "భక్తిగల విధానంలో" పదబంధం "దేవునికి లోబడే విధానం” లేదా “దేవుణ్ణి సంతోషపరచే క్రియలతోనూ, మాటలతోనూ" అని అనువదించబడవచ్చు.

  • "దైవభక్తి" పదం "దేవుణ్ణి సంతోషపరచే విధానంలో జీవించడం" లేదా "దేవునికి లోబడం" లేదా "నీతి మార్గంలో జీవించడం" అని అనువదించబడవచ్చు.

  • సందర్భాన్ని బట్టి, "దైవభక్తిలేని" పదం "దేవునికి ఇష్టం లేని విధంగా” లేదా “అనైతికంగా” లేదా “దేవునికి లోబడకుండా ఉండడం" అని అనువదించబడవచ్చు.

  • "దేవుడు లేని," "దేవుడు లేని స్థితి" పదాలు "దేవుడు లేకుండా" లేదా "దేవుడి గురించిన ఆలోచన లేకుండా" లేదా దేవుణ్ణి గుర్తించని మార్గంలో జీవించడం" అనే అక్షరార్థాన్ని కలిగియున్నాయి.

  • "దైవభక్తిలేని" లేదా "దేవుడు లేని స్థితి" పదాలు "దుర్మార్గత” లేదా "దుష్టత్వం” లేదా " “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు" అని ఇతరవిధాలుగా అనువదించవచ్చు.

(చూడండి దుష్టత్వం, ఘనత, లోబడు, నీతిమంతుడు, నీతి)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H430, H1100, H2623, H5760, H7563, G516, G763, G764, G765, G2124, G2150, G2152, G2153, G2316, G2317