te_tw/bible/other/sorcery.md

4.0 KiB

మాంత్రికుడు, మాంత్రికులు, మాంత్రికురాలు, వశీకరణం, మంత్ర ప్రయోగాలు, మంత్ర విద్య

నిర్వచనము:

“వశీకరణం” లేక “మంత్రవిద్య” అనే పదములు ఇంద్రజాలమును ఉపయోగించుటను సూచించును, ఇది దురాత్మల సహాయముతో శక్తివంతమైన కార్యములు చేయు మాయయైయున్నది. “మాంత్రికుడు” అనగా ఇటువంటి శక్తివంతమైన, మాయలన్నిటిని చేసే వ్యక్తి అని అర్థము.

  • ఇంద్రజాలము మరియు మంత్రలాను ఉపయోగించుట ద్వారా ప్రయోజనకరమైన పనులు చేయవచ్చు (ఎవరినైనా స్వస్థపరచడం) మరియు హానికరమైన పనులు చేయవచ్చు (ఎవరి మీదనైనా శాపమును ఉంచడం). అయితే మంత్రాలనుండి చేసే ప్రతి పని తప్పు, ఎందుకంటే వారు దురాత్మల శక్తిని ఉపయోగిస్తారు.
  • పరిశుద్ధ గ్రంథములో మంత్ర విద్యను అభ్యసించుట అనునది భయంకరమైన పాపములవంటి (వ్యభిచారము, విగ్రహములను ఆరాధించడం, మరియు పసిపిల్లలను బలి ఇవ్వడములాంటి పాపాలు) దుష్ట కార్యమైయున్నదని దేవుడు సెలవిచ్చుచున్నాడు.
  • “వశీకరణం” మరియు “మంత్రవిద్య” అనే పదాలను కూడా “దురాత్మ శక్తి” లేక “మంత్రాలు చదవడం” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “మాంత్రికుడు” అనే పదమును తర్జుమా చేయుట విభిన్న విధానములలో “ఇంద్రజాలము చేసే వ్యక్తి” లేక “మంత్రాలను ఉచ్చరించు వ్యక్తి” లేక “దురాత్మ శక్తి ద్వారా మహత్కార్యములను చేసే వ్యక్తి” అనే మాటలను ఉపయోగించుదురు.
  • “వశీకరణం” అనే పదముకు ఆత్మ ప్రపంచమును కలుసుకొనే ప్రయత్నము చేసే “శకునము చెప్పడం” అనే మాటకు చాలా వ్యత్యాసము ఉంటుందని గమనించండి,

(ఈ పదములను కూడా చూడండి: వ్యభిచారము, దెయ్యం, శకునము చెప్పడం, తప్పుడు దేవుడు, ఇంద్రజాలం, బలియాగం, ఆరాధన)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3784, H3785, H3786, H6049, G3095, G3096, G3097, G5331, G5332, G5333