te_tw/bible/kt/adultery.md

5.4 KiB

వ్యభిచారం, వ్యభిచార సంబంధమైన, వ్యభిచారి, వ్యభిచారిణి, వ్యభిచారులు, వ్యభిచారిణులు

నిర్వచనం:

ఈ పదం"వ్యభిచారం"అనేది పెళ్లి అయిన వ్యక్తి తన భార్య/భర్త లేక భర్త కాని వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని సూచిస్తున్నది. వారిద్దరూ ఆ విషయంలో అపరాధులే. "వ్యభిచార సంబంధమైన"అనే ఈ పదం ఎవరైనా ఈ పాపం జరిగించే మనస్తత్వం అనే అర్థం కూడా ఇస్తున్నది.

  • "వ్యభిచారి"అనే ఈ పదం సాధారణంగా వ్యభిచారం చేసే మనిషిని సూచిస్తున్నది.
  • కొన్ని సార్లు “వ్యభిచారిణి"అనే పదం ప్రత్యేకించి వ్యభిచారం చేసే స్త్రీకి వాడతారు.
  • వ్యభిచారం ఒక భర్త, భార్య చేసుకున్న వివాహ నిబంధనను భంగం చేస్తున్నది.
  • దేవుడు ఇశ్రాయేలీయులకు వ్యభిచారం చేయవద్దని అజ్ఞాపించాడు.
  • "వ్యభిచార సంబంధమైన"అనే ఈ పదం తరచుగా అలంకారికంగా దేవునికి ఇశ్రాయేలుజాతి అపనమ్మకాన్ని సూచించడానికి వాడతారు. ప్రత్యేకించి అబద్ద దేవుళ్ళ ఆరాధన విషయంలో.

అనువాదం సలహాలు:

  • లక్ష్య భాషలో "వ్యభిచారం"అనే అర్థం ఇచ్చే పదం లేకపోతే ఈ పదాన్ని ఇలా అనువదించ వచ్చు. "వేరొకరి భార్యతో లైంగిక సంబంధం” లేక “వేరొక వ్యక్తి భార్య/భర్తతో సన్నిహితంగా ఉండడం."
  • కొన్ని భాషల్లో వ్యభిచారం గురించి చెప్పడానికి సూటి అయిన పదం లేకపోవచ్చు. అలాటి చోట "వేరొకరి భార్య/భర్తతో పండుకోవడం” లేక “తన భార్యకు అపనమ్మకంగా ఉండడం." (చూడండి: సభ్యోక్తి)
  • "వ్యభిచార సంబంధమైన"అనే పదం అలంకారికంగా వాడినప్పుడు దాన్ని అక్షరార్థంగా అనువదించడం మంచిది. ఆ విధంగా దేవుని అవిధేయులను దేవుడు అపనమ్మకమైన భార్య/భర్తతో పోలుస్తున్నాడు.
  • లక్ష్య భాషలో సరైన అర్థం రాకపోతే, అలంకారికంగా "వ్యభిచార సంబంధమైన "అనే పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అపనమ్మకమైన” లేక “అవినీతిపరుడు” లేక “అపనమ్మకమైనభార్య/భర్త."

(చూడండి: జరిగించు, నిబంధన, లైంగిక అవినీతి, శయనించు, నమ్మకమైన వాడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 13:06 "వ్యభిచారం చెయ్యవద్దు."
  • 28:02 "వ్యభిచారం చెయ్యవద్దు.”
  • 34:07 "మతనాయకుడు ఇలా ప్రార్థించాడు, దేవా, ఈ మనిషిలాగా నేను పాపిని కాదు గనక-అలాటి దొంగలు, అన్యాయం చేసే మనుషులు, వ్యభిచారులు, లేక ఆ పన్ను వసూలుదారుడు వంటి వాణ్ణి కానందుకు నీకు వందనాలు.'"

పదం సమాచారం:

  • Strong's: H5003, H5004, G3428, G3429, G3430, G3431, G3432