te_tw/bible/other/fornication.md

3.6 KiB

లైంగిక అవినీతి, దుర్నీతి, అనైతిక, జారత్వం

నిర్వచనం:

"లైంగిక అవినీతి" అంటే వివాహం సంబంధం లేని మనిషికి ఒక స్త్రీతో ఉండే లైంగిక చర్య. ఇది దేవుని పథకానికి వ్యతిరేకం. కొన్ని పాతకాలం బైబిల్ వాచకాల్లో "జారత్వం" అని ఉంది.

  • ఈ పదాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగే ఏ విధమైన లైంగిక కార్యకలాపాలకు అయినా వాడవచ్చు. స్వలింగ సంపర్కం, అశ్లీల సాహిత్యం మొ.
  • ఒక విధమైన లైంగిక అవినీతి వ్యభిచారం, ఇది ఇదమిద్ధంగా వివాహితులకు తన భార్య/భర్త కానీ మనిషితో లైంగిక సంబంధం.
  • మరొక రకం లైంగిక అవినీతి "వేశ్యరికం," అంటే డబ్బు తీసుకుని ఎవరితోనైనా లైంగిక క్రియలో పాల్గొనడం.
  • ఈ పదాన్ని అలంకారికంగా దేవుని పట్ల ఇశ్రాయేలీయుల అపనమ్మకత్వం అంటే వారు ఆరాధించిన అబద్ద దేవుళ్ళ సంగతిని సూచించడానికి ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • "లైంగిక అవినీతి" అనే దాన్ని సరైన అర్థం వస్తుందనుకుంటే "దుర్నీతి" అని తర్జుమా చెయ్యవచ్చు.
  • అనువదించడం లో ఇతర పద్ధతులు "తప్పు లైంగిక క్రియలు“లేక “వివాహేతర సంబంధం."
  • ఈ పదాన్ని ఇంకా ఇలా తర్జుమా చెయ్య వచ్చు "వ్యభిచారం."
  • అలంకారికంగా దీని తర్జుమాలో వీలైతే అక్షరార్థంగానే చెయ్యాలి. ఎందుకంటే బైబిల్లో దేవునిపట్ల అపనమ్మకత్వం, లైంగికసంబంధంలో అపనమ్మకత్వాల మధ్య పోలిక ఉంది.

(చూడండి: వ్యభిచారం, అబద్ధ దేవుడు, వేశ్య, విశ్వసనీయత)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2181, H8457, G1608, G4202, G4203