te_tw/bible/other/prostitute.md

3.8 KiB

వేశ్య, వ్యభిచరించబడెను, వేశ్యలు, వ్యభిచారి, వ్యభిచరించుట

నిర్వచనము:

“వేశ్య” మరియు “వ్యభిచారి” అనే ఈ రెండు పదములు భక్తి సంబంధమైన ఆచారములకొరకు లేక డబ్భు కొరకు లైంగిక కార్యములను జరిగించే ఒక వ్యక్తిని సూచిస్తాయి. వ్యభిచారులు లేక వేశ్యలు సహజముగా ఆడవారే ఉంటారు, కొంతమంది మాత్రమె మగవారుంటారు.

  • పరిశుద్ధ గ్రంథములో “వేశ్య” అనే పదము కొన్నిమార్లు అబద్ధపు దేవుళ్ళను ఆరాధించువారిని లేక మంత్రవిద్యలను అనుసరించువారిని సూచించుటకు అలంకారికముగా వాడబడియున్నది.
  • “వేశ్యవలె నడుచుకో” అనే ఈ మాటకు అనైతిక లైంగిక కార్యాలను జరిగించే ఒక వేశ్యవలె ప్రవర్తించుట అని అర్థము. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో విగ్రహములకు ఆరాధన చేసే ఒక వ్యక్తిని సూచించుటకు కూడా వాడబడింది.
  • దేనికో ఒకదానికి “తనను తాను వేశ్యగా చేసికొనుట” అనే మాటకు అనైతిక లైంగికతను కలిగియుండుట లేక ఇది అలంకారముగా చెప్పినప్పుడు, తప్పుడు దేవుళ్ళను ఆరాధించుట ద్వారా నిజ దేవునికి అపనమ్మకస్తులుగా ఉండుట అని అర్థము.
  • పురాతన కాలములో కొన్ని అన్య దేవాలయములు వారి ఆచార సంప్రదాయములలో భాగముగా స్త్రీ పురుష వ్యభిచారులను ఉపయోగించేవారు.
  • ఈ పదమును వేశ్యను సూచించుటకు అనువాద భాషలో ఉపయోగించే పదమును లేక మాటను ఉపయోగించి అనువాదము చేయవచ్చును. కొన్ని భాషలు ఈ పదము కొరకు బహుశః సభ్యోక్తి పదమును ఉపయోగించుదురు.

(చూడండి: సబ్దోక్తి)

(ఈ పదములను కూడా చూడండి: వ్యభిచారము, తప్పుడు దేవుడు, అనైతిక లైంగికత, అబద్ధపు దేవుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2154, H2181, H2183, H2185, H6945, H6948, H8457, G4204