te_tw/bible/other/slaughter.md

3.6 KiB

వధ, వధించుట, వధించబడెను, వధించబడెను

నిర్వచనము:

“వధ” అనే ఈ పదము ప్రజలనైన లేక ప్రాణులనైన ఎక్కువ సంఖ్యలో చంపుటను లేదా హింసాత్మకమైన విధానములో చంపుటను సూచిస్తుంది. ఆహారము భుజించు ఉద్దేశము కొరకు ప్రాణిని చంపుటను కూడా ఈ పదము సూచించును. వధించే క్రియను కూడా “వధ” అని పిలిచెదరు.

  • అబ్రాహాము అరణ్యములో తన గుడారము వద్ద ముగ్గురు అతిథులను చేర్చుకున్నప్పుడు, తన అతిథుల కొరకు ఒక క్రొవ్విన దూడను వధించి భోజనమునకు సిద్ధము చేయమని తన దాసులకు ఆదేశించెను.
  • దేవుడు తన వాక్కులను అనుసరించి నడుచుకొనని వారినందరిని వధించుటకు తన దూతలను పంపించునని ప్రవక్తయైన యేహెజ్కేలు ప్రవచించెను.
  • దేవునికి ఇశ్రాయేలీయులు అవిధేయత చూపించినందున వారు తమ శత్రువుల ద్వారా సరిసుమారు 30,000 వేలమంది అతి ఘోరముగా వధించబడియున్నారని 1 సమూయేలు గ్రంథములో దాఖలు చేయబడియున్నది.
  • “వధించు ఆయుధాలు” అనే ఈ మాటను “చంపుటకొరకు ఆయుధాలు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “వధ అతి ఘోరమైనది” అనే ఈ మాటను “ఎక్కువ సంఖ్యలో చనిపోయిరి” లేక “చనిపోయినవారి సంఖ్య ఎక్కువ” లేక “ఎక్కువ సంఖ్యలో ప్రజలు అతి భయానకముగా చంపబడ్డారు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “వధ” అనే ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములలో “చంపు” లేక “వధించు” లేక “చంపుట” అనే పదాలను ఉపయోగించుదురు.

(ఈ పదములను కూడా చూడండి: దూత, ఆవు, అవిధేయత, యేహెజ్కేలు, దాసుడు, వధించుట)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2026, H2027, H2028, H2076, H2491, H2873, H2874, H2878, H4046, H4293, H4347, H4660, H5221, H6993, H7524, H7819, H7821, G2871, G4967, G4969, G5408